కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలోని కృషి హైస్కూల్లో సోమవారం ఎస్జీఎఫ్ భీమ్గల్ అర్బన్స్థాయి అండర్–17 బాలురు, బాలికల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీల్లో భీమ్గల్ అర్బన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను తుది జట్లకు ఎంపిక చేసినట్లు భీమ్గల్ అర్బన్ ఇన్చార్జి సెక్రెటరీ సదమస్తుల రమణ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు మంగళవారం నందిపేట్లో జరగనున్న జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీలో పాల్గొంటారని పేర్కొ న్నారు. కృషి హైస్కూల్ కరస్పాండెంట్ అజిత్ రెడ్డి, పీఈటీలు నరేశ్, లింగం, అభిషేక్, రాకేశ్, ప్రశాంత్, సుమన్, గంగాధర్, రాహుల్ పాల్గొన్నారు.


