బయోటెక్నాలజీలో గెస్ట్‌లెక్చర్‌ | - | Sakshi
Sakshi News home page

బయోటెక్నాలజీలో గెస్ట్‌లెక్చర్‌

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో సోమవారం ‘మాలిక్యులర్‌ వైరాలజీ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీలో కంప్యూటేషనల్‌ బయోలాజికల్‌ విధానాలు’ అనే అంశంపై పాండిచ్చేరి వర్సిటీ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ రజనీష్‌ అనుపమ్‌ ప్రత్యేక ఆహ్వానిత ఉపన్యాసం అందించారు. ఈ సందర్భంగా వైరాలజీ యాంటీ వైరల్‌, క్యాన్సర్‌ నిరోధక మందుల తయారీ, మాలిక్యులర్‌ రెగ్యులేషన్‌, వైరస్‌లు సాధారణ కణాలపై ఎలా దాడి చేస్తాయి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు, పరిశోధకులతో నిర్వహించిన ముఖాముఖిలో పలు శాసీ్త్రయ సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తెయూ రిజిస్ట్రార్‌ ఎం.యాదగిరి శాస్త్రవేత్త డాక్టర్‌ రజనీష్‌ అనుపమ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగాధిపతి మహేందర్‌ ఐలేని, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ కిరణ్మయి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.ప్రసన్న షీలా, పార్ట్‌ టైమ్‌ లెక్చరర్‌ ప్రసన్నకుమారి, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జి.బాలకిషన్‌, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement