బాన్సువాడ: నాటు బాంబులు పేలిన ఘటనలో తీ వ్ర గాయాలై హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న చిన్నారులను సోమవారం బా న్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. తాడ్కోల్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చలో ఆదివారం సాయంత్రం నాటు బాంబులు పేలి ఏడుగురికి గాయాలైన విషయం తెలిసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దండ్ల శ్రీదేవి, దండ్ల అంజలి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడంతోపాటు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. పోచారం వెంట తాడ్కోల్ సర్పంచ్ రమేశ్, మాజీ జట్పీటీసీ గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


