భీమ్‌గల్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ తనిఖీ

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

యువకుడిపై కోతుల దాడి ఒకరికి రెండు రోజుల జైలు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ను జిల్లా మానిటరింగ్‌ కమిటీ సోమ వారం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా పాఠశాలలో అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. గ్రంథాలయం, సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. ఎంఈవో స్వా మి, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు చిన్నయ్య, విశ్వనాథ్‌, రమేశ్‌, అశోక్‌, ఉపాధ్యాయులు లింబాద్రి, రఘునాథ్‌, రాజ్‌కుమార్‌, వాసుదేవ్‌, శివకుమార్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో సోమవారం ఓ యువకుడిపై కోతులు దాడిచేశాయి. కాలనీలో చిన్నారులపై కోతులు దాడి చేయబోతుండగా వాటిని తరిమేందుకు శ్రీనివాస్‌ గౌడ్‌ యత్నించాడు. అయితే కోతుల గుంపు ఒక్కసారిగా శ్రీనివాస్‌గౌడ్‌పై దాడి చేశాయి. గాయాలు కావడంతో బాధితుడు ఆస్పత్రికి వెళ్లి చిక్సిత తీసుకున్నాడు.

నిజామాబాద్‌ అర్బన్‌: రెండో టౌన్‌ పరిధిలో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. కుటుంబ వ్యవహారంలో గొడవకు దారితీయడం, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గొడవ సృష్టించడంలో విజయ్‌కుమార్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement