నిజామాబాద్ అర్బన్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌ఐఆర్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన ఓటరు నమోదు, సవరణలు/మార్పులు, తొలగింపు కోసం ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చే యాలన్నారు. జాబితా నుంచి ఓటు తొలగింపున కు కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. నిబంధనల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, అధికారులు పాల్గొన్నారు.


