నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

వ్యాపారులు ముందుకు రావడం లేదు

న్యూస్‌రీల్‌

● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

సుదర్శన్‌ రెడ్డి

అటవీ భూముల పరిరక్షణకు..

జిల్లాలోని అటవీ భూములు, వన్యప్రాణుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– 8లో u

నిరుపయోగంగా ఉన్న షెడ్లు

బస్సుల సమాచారం కోసం ఎంకై ్వరీ నంబర్‌

నిజామాబాద్‌ రూరల్‌: బస్సుల రాకపోకల సమాచారం తెలిపేందుకు ప్రయాణికుల సౌ కర్యార్థం ప్రత్యేకంగా ఎంకై ్వరీ నంబర్‌ ఏర్పా టు చేసినట్లు ఆర్టీసీ డిపో–1 మేనేజర్‌ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. బస్సులకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులు 9959226022 నంబర్‌ కు ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నా రు.

నిబంధనలు పాటించాలి

నిజామాబాద్‌అర్బన్‌: టపాకాయల విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. దీపావళి సందర్భంగా తాత్కాలికంగా టపాకాయల దుకాణాల ఏర్పాటుకు సంబంధించి వ్యాపారులతో కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భద్రతాఏర్పాట్లలో నిర్లక్ష్యనికి తావివ్వొద్దని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందిన తరువాతే విక్రయాలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలకు పటాకులు విక్రయించవద్దన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం

సిరికొండ : జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పో టీల్లో సిరికొండ స త్యశోధక్‌ పాఠశాల కు చెందిన విద్యార్థిని అగ్యారం యుగేశ్వరి కాంస్య పతకం సాధించిందని ప్రిన్సిపల్‌ నర్సయ్య తెలిపారు. మహారాష్ట్రలోని కోపర్‌గావ్‌ సంజీవని యూనివర్సిటీలో అక్టోబర్‌ 28 నుంచి 31 వరకు జరిగిన జాతీయ స్థా యి మినీ సబ్‌ జూనియర్‌ అండర్‌–13 విభా గం పోటీల్లో యుగేశ్వరి రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని ప్రతిభ చాటినట్లు పేర్కొన్నారు. జా తీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించడంపై ప్రిన్సిపల్‌, పీఈటీలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

రైల్వేగేట్‌ మూసివేత

బోధన్‌: ఎడపల్లి మండలంలోని జానకంపే ట నుంచి నవీపేట, బాసర వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న రైల్వే గేట్‌ను సోమవారం మూసివేశారు. రైల్వే గేట్‌ వద్ద ట్రాక్‌, ఇతర మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నెల 5వ తేదీ వరకు గేటు మూసివేత కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. నిజామా బాద్‌, ఇతర జిల్లాల నుంచి నవీపేట వైపు వెళ్లేందుకు ఎడపల్లి మండలంలోని సాటాపూర్‌, దూపల్లి గేట్‌ మీదుగా ప్రయాణించా లని సూచించారు.

ఐఎంఏకు అవార్డులు

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ ఐఎంఏకు నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కా యి. ఐఎంఏ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ని ర్వహించిన రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌లో సమా వేశంలో బెస్ట్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ ఆ కుల విశాల్‌. బెస్ట్‌ బ్రాంచ్‌ సెక్రెటరీగా డాక్టర్‌ డీ హరీశ్‌స్వామి అవార్డులు అందుకున్నారు. ప్రశంసాపురస్కారం డాక్టర్‌ రమణేశ్వర్‌, డాక్టర్‌ చైతన్యకు లభించాయి. జిల్లా ఐఎంఏకు అవార్డులు దక్కడంపై వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఆరు దశాబ్దాలుగా..

అక్కరకు రాని ఏఎంసీ!

ఆర్మూర్‌ : పంట దిగుబడుల క్రయవిక్రయాలతో కిటకిటలాడాల్సిన ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు రాజకీయ నిరుద్యోగులకు నామినేటెడ్‌ పదవులు పొందేందుకు మాత్రమే అన్నట్లు మారిపోయింది. మార్కెట్‌ యార్డును పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగకరంగా అభివృద్ధి చేసే నాయకులు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 11.07 ఎకరాల విస్తీర్ణంలో 1965 జూలై 6న నెలకొల్పిన వ్యవసాయ మార్కెట్‌యార్డు నేటికీ రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. పాలకుల నిర్లక్ష్యం, జిల్లా కేంద్రంలోని వ్యాపారుల స్వార్థ రాజకీయాల కారణంగా ఆర్మూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో పంట దిగుబడుల క్రయ విక్రయాలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఏఎంసీ ఏర్పాటు చేసిన సమయంలో దీని పరిధిలో ఆర్మూర్‌ పాత తాలూకా పరిధిలోని మండలాలు అన్నీ ఉండేవి. క్రమంగా కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ ఏఎంసీలు ఏర్పాటు కావడంతో ఆర్మూర్‌ ఏఎంసీ పరిధి తగ్గిపోయింది. ప్రస్తుతం ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి మండలాలు మాత్రమే ఉన్నాయి. ఆర్మూర్‌ యార్డులో దుకాణాలు ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి పంట దిగుబడులు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యాపారులకు ఈ ప్రాంగణంలో 62 ప్లాట్లు కేటాయించారు. క్రయ విక్రయాలు చేయకపోవడంతో ఏఎంసీ అధికారులు కోర్టును ఆశ్రయించి ప్లాట్లను రద్దు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సమయానుకూలంగా మక్కలు, వరి సీజన్‌లో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలైన మార్క్‌ఫెడ్‌, ఐడీసీఎంఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో తాత్కాలిక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. నాలుగు విశాలమై న గోదాములు, షెడ్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయి క్రయ విక్రయాలు నిర్వహించడానికి అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ వ్యాపారులు ఆ సక్తి చూపడం లేదనే వంకతో ఆర్మూర్‌ ఏఎంసీని పా లకులు అభివృద్ధి చేయడం లేదనే విమర్శలున్నా యి. ఆర్మూర్‌ ఏఎంసీ జిల్లా కేంద్రంలోని ఏఎంసీకి సమీపంలో ఉండటంతో క్రయ విక్రయాలు జరగ డం లేదంటూ కొందరు నాయకులు సమస్యను క ప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రైతులకు ఉపయోగపడాల్సిన మార్కెట్‌ కమిటీ ప్రైవేట్‌, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.

ఆర్మూర్‌ ఏఎంసీలో పూర్తి స్థాయి క్రయ విక్రయాలు ని ర్వహించడానికి వ్యాపారు లు ముందుకు రావడం లే దు. పంట కొనే వ్యాపారు లు లేని కారణంగా రైతులు తాము పండించిన పంటను జిల్లా కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. – గ్యాదరి

పరమేశ్వర్‌, ఇన్‌చార్జి కార్యదర్శి, ఏఎంసీ, ఆర్మూర్‌

రూ.కోట్లలో ఆదాయం..

ఆర్మూర్‌ ఏఎంసీ ప్రాంగణంలో నిర్మించిన వ్యా పార సముదాయాలు, పంటను రవాణా చేస్తు న్న రైతుల నుంచి వసూలు చేసిన పన్నులు, సీడ్‌ వ్యాపారులు, రైస్‌ మిల్లర్ల నుంచి వసూలు చేసే పన్ను కలిపి రూ.కోట్లకు పైగా నిధులు మి గులు ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2 కోట్ల 37 లక్షల 70 వేలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.2 కోట్ల 21 లక్షల ఒక వెయ్యి వసూలయ్యాయి. ఆర్మూర్‌ ఏఎంసీ పరిధిలో పెర్కిట్‌, అంకాపూర్‌లో చెక్‌ పోస్టులు ఉన్నాయి. యార్డు ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉండటంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లో కలిపి 36 దుకాణం మడి గెలను నిర్మించి అద్దెకు ఇచ్చారు. అద్దె రూపంలో రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది.

నిరుపయోగంగా మారిన

ఆర్మూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు

గత్యంతరం లేక పంట అమ్మకానికి

జిల్లా కేంద్రానికి తరలి వెళ్తున్న రైతులు

61 ఏళ్లు గడుస్తున్నా ఉపయోగంలోకి తీసుకురాని పాలకులు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం

క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను

పర్యవేక్షించాలి

అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ

ఏర్పాట్లు చేసుకోవాలి

అధికారులకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

దిశానిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement