ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలి

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌ అర్బన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 109 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్డీవో సాయన్నకు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. జిల్లా స్థాయిలో, సీఎం ప్రజావాణిలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అర్జీదారులకు వారి వినతులపై చేపట్టిన చర్యల వివరాలను లిఖిత పూర్వకంగా అందజేయాలని, వివరాలను వెంటవెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఖాళీ బిందెలతో నిరసన..

తాగేందుకు నీళ్లు లేవని, నీటి కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిజామాబాద్‌ నగరంలోని 11వ డివిజన్‌కు చెందిన మహిళలు సోమవారం కలెక్టరేట్‌ ప్రవేశ మార్గం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement