కామారెడ్డి కాంగ్రెస్‌లో కలకలం! | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డి కాంగ్రెస్‌లో కలకలం!

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఢిల్లీలో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కామారెడ్డి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో’ నినాదంతో దేశ రాజధానిలో ఇండి కూటమి చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు తరలివెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌ మంత్రిని కలిసిన సందర్భంగా ఆయన అకారణంగా ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. మంత్రి మాటలతో లక్ష్మీకాంతారావ్‌ అవాకై ్కనట్లు సమాచారం. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. పలువురు నేతలు ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌కు ఫోన్‌ చేసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌ ‘సాక్షి’తో ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గరకు వెళ్లి పలకరించిన పాపానికి ఆయన తనపై నోరు పారేసుకున్నాడని, పరుష పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతగా, మంత్రిగా ఆయన ఎన్ని మాటలు అన్నా తాను ఎదురు మాట్లాడకుండా ఉండిపోయానని పేర్కొన్నారు. మంత్రి మాటలు తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని, ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు.

జుక్కల్‌ ఎమ్మెల్యేపై

మంత్రి దామోదర గుస్సా

ఢిల్లీలో పలకరించిన పాపానికి

దుర్భాషలాడాడంటున్న ఎమ్మెల్యే

అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement