అడుగంటుతున్న ‘సింగూరు’ | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న ‘సింగూరు’

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

ఏర్పాట్లు చేస్తున్నాం

నిజాంసాగర్‌(జుక్కల్‌): సింగూరు ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. ప్రస్తుతం 2.9 టీఎంసీల నీరే నిల్వ ఉంది. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

796 గ్రామాలకు తాగు నీరు..

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల పరిధిలో 796 గ్రామాలకు శుద్ధ జలాలు అందుతున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు 100 ఎల్‌పీసీల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సింగూరులో 2.9 టీఎంసీల నీరే ఉండడంతో భగీరథ నీటి సరఫరాకు గడ్డు కాలం ఎదురుకానుంది. ప్రస్తుతం ఉన్న నీరు డిసెంబర్‌ నెలాఖరు వరకే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉన్న నీటిని సైతం రోజువిడిచి రోజు సరఫరా చేస్తున్నారు. రెండు నెలల తర్వాత భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.

ప్రత్యామ్నాయాలకు నిధులు..

సింగూరు ప్రాజెక్టు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. సింగూర్‌ మిషన్‌ భగీరథ వాటర్‌ గ్రిడ్‌ పరిధిలో ఏర్పాట్ల కోసం రూ. 120 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అవసరమైన చోట బోర్లకు ఫ్లషింగ్‌ చేయించనున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోనున్నారు.

సింగూరు ప్రాజెక్టు

సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో రోజు విడిచి రోజు నీ టిని సరఫరా చేస్తున్నాం. డిసెంబర్‌ నెలాఖరు వరకు నీరు సరిపోతుంది. తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గ్రా మాల్లోని బోర్ల ఫ్లషింగ్‌, వ్యవసాయ బోర్లు అద్దెకు తీ సుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. – స్వప్న, ఈఈ, మిషన్‌ భగీరథ

2.9 టీఎంసీలకు తగ్గిన నీటినిల్వ

రోజువిడిచి రోజు భగీరథ నీటి సరఫరా

డిసెంబర్‌ వరకే నీళ్లు

సరిపోతాయంటున్న అధికారులు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement