27న ఉల్లాస్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

27న ఉల్లాస్‌ పరీక్ష

Sep 26 2026 12:50 AM | Updated on Sep 26 2026 12:50 AM

27న ఉల్లాస్‌ పరీక్ష ఎస్టీ గురుకులంలో ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్స్‌ ఎల్‌ఎల్‌బీ రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి నేడు హన్మకొండలో ‘సహరా’ బాధితుల సమావేశం ఆర్థికసాయం అందజేత

ఖలీల్‌వాడి: నవ భారత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ‘‘అమ్మకు అక్షరమాల’’ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఎల్‌ నెట్‌) పరీక్షను ఈనెల 27న జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సాయన్న శుక్రవారం తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుందని ఈ వ్యవధిలో అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో పరీక్షకు హాజరుకావాలని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 31,702 అభ్యాసకులు ఈ ఎఫ్‌ఎల్‌ నెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. గతంలో పరీక్షకు హాజరు కాలేకపోయిన లేదా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని అభ్యాసకులను కూడా గుర్తించి, వారిని తిరిగి సమీకరించి పరీక్షకు సిద్ధం చేయడానికి సెర్ఫ్‌, డీఆర్డీఏ, మెప్మా, వయోజన విద్యాశాఖతో పాటు మండల, గ్రామస్థాయి సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇందల్వాయి: ఇందల్వాయి గిరిజన గురుకుల బాలికల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్‌ అడ్మిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి ఆసక్తి ఉన్న విద్యార్థినులు సరైన ధ్రువపత్రాలతో నేడు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప రిధిలో ఇటీవల జరిగిన ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ల రె గ్యులర్‌/బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల ఫలితాల రీవాల్యుయేషన్‌ కోసం ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌బీఐ తెలంగాణ యూనివర్సిటీలో అ క్టోబర్‌ ఒకటవ తేదీ వరకు చెల్లుబాటు అయ్యేవిధంగా రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు సంబంధిత రీవాల్యుయేషన్‌ దరఖాస్తు ఫారాలను యూనివర్సిటీ పరీక్ష కేంద్రంలో అక్టోబర్‌ 5న సాయంత్రం 4 గంటల వరకు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. రీవాల్యుయేషన్‌ ఫీజు ప్రతి పేపర్‌కు రూ.500, అప్లికేషన్‌ ఫారం రూ.25 (ప్రతిఫారం) చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ వర్సిటీ వెబ్‌ సైట్‌ను సందర్శించాలన్నారు.

సిరికొండ: హన్మకొండలో శనివారం సహరా బాధితుల సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది బాధితులకు రెండు లక్షల కోట్లకు పైగా పొదుపు డబ్బులను సదరు సంస్థ చెల్లించాల్సి ఉందన్నారు. సహరా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ఉద్యమ కార్యాచరణ కోసం హన్మకొండలో నిర్వహిస్తున్న సమావేశంను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నిజామాబాద్‌అర్బన్‌: కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కుమ్మరి ప్రణతి ఇటీవల ఖమ్మంలోని మమతా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్య ఆమెకు వైద్య విద్యను కొనసాగించేందుకు హెల్పింగ్‌ హార్డ్‌ ఫౌండేషన్‌ తరపున రూ.50 వేల ఆర్థికసాయం ప్రకటించారు. ఈసందర్భంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో శుక్రవారం అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రమన్‌ రెడ్డి సంయుక్తంగా విద్యార్థినికి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement