ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించాలి

Sep 26 2026 12:50 AM | Updated on Sep 26 2026 12:50 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): వీబీజీ రామ్‌జీ పథకం కింద గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే, అవసరమైన నాణ్యమైన పనులను గుర్తించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న అన్నారు. భీమ్‌గల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం వికసిత్‌ గ్రామపంచాయతీ ప్రణాళికలపై భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ.. పథకంలో 375 రకాల పనులు ఉన్నాయని, గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించే ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. బాబానగర్‌ గ్రామంలోని సామాజిక, వనరుల పటాలను ప్రదర్శించి వీబీజీ రామ్‌జీ పథకంలో ఎలాంటి పనులు గుర్తించవచ్చో తెలియజేశారు. అనంతరం ప్రణాళిక తయారీకి సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా రిసోర్స్‌ పర్సన్లు వివరించారు. ఏపీడీ గంగామోహన్‌, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, ఏపీవో జి. నర్సయ్య పాల్గొన్నారు.

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండలోని రైతు వేదికలో బాల్కొండ ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, అధికారులకు వీబీజీరామ్‌జీ ప్లానింగ్‌ ప్రాసెస్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడు దశల్లో 125 పనిరోజుల కార్యక్రమాన్ని సర్పంచులు, అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలన్నారు. వచ్చే నెల 2న గాంధీ జయంతి రోజున నిర్వహించే గ్రామసభలో పనులను ఖరారు చేయాలన్నారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సర్పంచులు కోరారు. అంతేగాక గతంలో చేసిన పనులను బిల్లులు ఇవ్వాలని కోరారు. మండల గ్రామాలలో అభివృద్ధి పనులు గుర్తించే విధానాన్ని పటం ద్వారా వివరించారు. బాల్కొండ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, బాల్కొండ, నందిపేట్‌, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్‌ ఎంపీడీవోలు విజయ్‌భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శివచరణ్‌, లక్ష్మణ్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement