వర్ని: మోస్రా మండల కేంద్రంలోని విగ్నేశ్వర సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టుకు విఘ్నేశ్వరుడి ఆకారం వెలిసింది. గత కొన్ని రోజుల క్రితం మర్రిచెట్టులో గణపతి ఆకారంను గుర్తించిన ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చెట్టుకు వెలిసిన గణనాథుడి ఆకారాన్ని చూడటానికి గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. గణేశుడి ఆకారానికి ప్రత్యేక పూజలతోపాటు అలంకరణ, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు నరేష్ బాబా వెల్లడించారు.


