కమ్మర్‌పల్లి: మండలకేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలబాలికల జట్ల శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఎంపికై న జట్లు ఈ నెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో నిర్వహించనున్న జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొననున్నాయి. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగా మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాల నవీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలెపు నర్సయ్య, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎం. సుజాత, సభ్యులు మెండే రమేష్, ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, సీనియర్ క్రీడాకారులు సాగర్, గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం కోచ్ రాహుల్, జిల్లా కోచ్‌లు నరేష్, అనికేత్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
బాలికల జట్టు..
సౌజన్య, వర్షిని, షర్లీన్ షైనీ, నిషిత, మధుమిత (నిజామాబాద్), గాయత్రి, కళ్యాణి, పావని (మహబూబ్‌నగర్), అచ్యుత, అక్షిత (వరంగల్), దీక్షిత (నల్గొండ), దీపిక (సిద్దిపేట), శ్రావ్యశ్రీ (జగిత్యాల), వర్షిత (కొత్తగూడెం), తేజశ్రీ (మెదక్), శివవర్షిని (హనుమకొండ).
బాలుర జట్టు..
రిశేంద్ర వర్మ, రాష్ట్రపాల్, సుశాంత్ కుమార్, తాండవ కృష్ణ సేన (మంచిర్యాల), నిహాల్ చంద్ర, చాణక్య, అజయ్, విగ్నేష్ (నిజామాబాద్), శ్రీకర్, సాత్విక్ (హైదరాబాద్), రిత్విక్ (సిద్దిపేట), దీక్షిత్ (వరంగల్), జితేష్ (మెదక్), వర్షిత్ (హనుమకొండ), జస్వంత్ (జగిత్యాల), సనత్ (జయశంకర్ భూపాలపల్లి).


