భక్తి శ్రద్ధలతో ఐడీవోసీ గణేశ్‌ నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో ఐడీవోసీ గణేశ్‌ నిమజ్జనం

Sep 26 2026 12:50 AM | Updated on Sep 26 2026 12:50 AM

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)లో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జనోత్సవం శుక్రవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. అందంగా అలంకరించిన రథంలోకి స్వామివారిని చేర్చి, నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్ర సందర్భంగా దారి పొడుగున కలెక్టరేట్‌లోని వివిధ శాఖల ఉద్యోగులు భక్తిగీతాలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ లోని ఆయా విభాగాల సూపరింటెండెంట్లు శ్రీనివాస్‌, భాస్కర్‌ ఇతర అధికారులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రమన్‌రెడ్డి, తహసీల్దార్లు వినయ్‌సాగర్‌, సతీష్‌, బాలరాజు, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement