మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ మాసాని చెరువు సమీపంలోగల నిజాంసాగర్ కెనాల్‌లో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దశరథ్ (41) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు శుక్రవారం స్నానం చేసేందుకు కెనాల్‌లో దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దశరథ్ కోసం ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. రాత్రయినా మృతదేహం లభించలేదు.
రామారెడ్డి (ఎల్లారెడ్డి): ‘దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగ లు వచ్చాయంటే గ్రా మాల్లో కోలాహలం మొదలవుతుంది. ఆ కోలాహలాన్ని మరింత పెంచడంలో గంగిరెద్దులను ఆడించేవారు కూడా ము ఖ్యమే. శుక్రవారం తమ జీవనాధారమైన ఎద్దులతో పాటు, తమకు తోడుగా ఉండే శునకాలను కూడా వారు తమ వెంట తీసుకువెళ్తున్నారు. కామారెడ్డి వైపు నుంచి రామారెడ్డి గ్రామానికి వస్తున్న ఒక గంగిరెద్దుపై, వారు మోస్తున్న రంగురంగుల దుప్పట్లు, సామగ్రితో పాటు, వారి పెంపుడు కుక్క కూడా చాలా రాజసంగా ఆ ఎద్దుపై కూర్చుని ప్రయాణి స్తోంది. ఈ చిత్రాన్ని శుక్రవారం ‘సాక్షి’కి చిక్కింది. ఎద్దు నడుస్తుంటే, కుక్క ఏమాత్రం భయపడకుండా, తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.


