● ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఎస్‌వీఎన్ కృష్ణమూర్తి
● రోడ్డు భద్రత, ఇంధన పొదుపుపై డ్రైవర్లకు శిక్షణ
నిజామాబాద్ రూరల్ : చిన్న నిర్లక్ష్యం ప్రమాదానికి దారి తీస్తుందని, డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత, దృశ్య అవగాహన, మానసిక ప్రశాంత ఎంతో ముఖ్యమని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఎస్‌వీఎన్ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ఇంధన పొదుపుపై శిక్షణ శిక్షణ ఇచ్చారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆర్‌ఎం సూచించారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ సైకాలజిస్ట్ వీ ప్రవీణ్, నిజామాబాద్ డిపో–1 మేనేజర్ వెంకటరమణ వివిధ అంశాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, ఇతర విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


