గిట్టుబాటుపై గుబులు | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటుపై గుబులు

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

రైతులకు నష్టం

ముడిపామాయిల్‌పై తగ్గిన దిగుమతి సుంకం

● దేశీయ ఉత్పత్తి రంగానికి

శరాఘాతమంటున్న రైతులు

● జిల్లాలో 6,684 ఎకరాల్లో సాగు

ఆర్మూర్‌: ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయాన్ని పొందొచ్చని, నాటిన 6 ఏళ్ల తరువాత నుంచి 40 ఏళ్లపాటు దిగుబడి పొందొచ్చని అధికారులు అవగాహన కల్పిస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. రైతులు సైతం ఆయిల్‌పామ్‌ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమ తి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. ఈ నిర్ణయం దేశీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే తిరోగమన చర్య అంటూ నేషనల్‌ ఆయిల్‌ పామ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌తోపాటు రైతు సంఘాలు ఖండిస్తున్నాయి. దే శీయ రిఫైనింగ్‌ పరిశ్రమకు రక్షణ ఇస్తూ.. రైతులను మాత్రం విదేశీ పోటీకి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో 2022–23 సంవత్సరం నుంచి ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ – ఆయిల్‌ పామ్‌ కింద రైతులకు సబ్సిడీపై మొక్కలు ఇస్తున్నారు. ఎకరాకు 20 టన్నుల వరకు (ఫ్రెష్‌ ఫ్రూట్‌ బంచెస్‌) దిగుబడి వస్తుంది. ఈ ఏడాదికి 6,684 ఎకరాల్లో మొక్కలను నాటగా మొదటి విడతలో నాటిన రైతుల నుంచి సుమారు 1,713 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను ఎఫ్‌ఎఫ్‌బీకి రూ.24 వేల రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా..

విదేశీ పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గిస్తే రానున్న రోజుల్లో దేశీయ పంటకు డిమాండ్‌ తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌కు చెందిన రైతు వజ్రంరెడ్డి పదేళ్ల క్రితం ఆయిల్‌ పామ్‌ వేశారు. ఎకరాకు రూ.80 వేలు పెట్టుబడి పె ట్టాడు. డ్రిప్‌, ఎరువులు, కూలీల ఖర్చు రెట్టింపు అయింది. ప్రభుత్వం స్వయం సమృద్ధి అంటూ సాగు చేయమని చెప్పి, ఇప్పుడు చౌకగా విదేశీ పామాయిల్‌ తెస్తే మా పంటకు ధర ఎలా వస్తుంది..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. టన్నుకు రూ.25,000 గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా సుంకం 49 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విదేశాల నుంచి పామాయిల్‌ చౌకగా వస్తే, మిల్లులు మన రైతు దగ్గర కొనరు. బయటిదే కొంటారు. స్థానికంగా ఆయిల్‌పామ్‌ గెలలకు ధర పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. ముడి పామాయిల్‌, శుద్ధి చేసిన పామాయిల్‌ మధ్య సుంకంలో తేడాతో విదేశాల నుంచి ముడి నూనె తెచ్చి, ఇక్కడ శుద్ధి చేసే పెద్ద కంపెనీలకు లాభం. వారు చౌకగా తెచ్చి, ఇక్కడ రిఫైన్‌ చేసి ఎక్కువకు అమ్ముకుంటారు. కానీ ముడి నూనె పండించే రైతుకు మాత్రం రక్షణ లేదు.

– ఏనుగు భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు,

ఆయిల్‌పామ్‌ రైతుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement