అత్యధికంగా 4.36 లక్షల ఎకరాల్లో వరినాట్లు
● కొంత మేర పెరిగిన పత్తి, పప్పుదినుసుల సాగు విస్తీర్ణం
● సరైన సమయానికి వర్షాలు కురవడంతో పంటలకు ఊపిరి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎల్‌నినోకు ఎదురెళ్లి మరీ రైతులు ఖరీఫ్ పంటల సాగును ప్రారంభించగా.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆగస్టు నెలలో వానలు కురిపించి పంటలకు ప్రాణం పోసిన వరుణుడు.. సాగును ముందుకు నడిపించాడు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాకు మించి జిల్లాలో పంట లు సాగవుతున్నాయి. 5.24లక్షల ఎకరాల్లో ఆయా పంటలు (ఉద్యాన పంటలు కాకుండా) సాగవుతా యని అంచనా కాగా, 5.28 లక్షల ఎకరాల్లో సాగవుతుండడం గమనార్హం. అయితే వర్షాకాలం తొలినాళ్లలో చినుకుల జాడ లేకపోవడంతో పంటలు సాగు చేయడానికి రైతులు సంకోచించారు. జూలై మొదటి వారం వరకు 2లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డా యి. జూలై చివరి రెండు రోజులతోపాటు ఆగస్టు మొదటి వారంలో పడిన వర్షాలతో వరినాట్లు ఊపందుకుని 25 రోజుల్లోనే వరి సాగు రెండింతలు పెరిగింది. అంచనాకు మించి 4.36లక్షల ఎకరాలు దాటగా, ప్రస్తుతం పొట్టదశలో ఉంది. భూగర్భ జ లాలు పెరగడం, ప్రాజెక్టుల్లో నీరు ఉండడంతో వరి పంటకూడా బయటపడినట్లేనని రైతులు అంటున్నారు. ఇటు ఆరుతడి పంటలైన పత్తి, పప్పుదిను సుల సాగు కొంత మేర పెరిగింది. ఖరీ ఫ్‌లో సాగవుతున్న పంటల వివరాలను వ్యవసాయాధికారు లు ఆన్‌లైన్‌లో న మోదు చేస్తున్నారు.
పంట ఎకరాలు
వరి 4,36,000
మొక్కజొన్న 54,255
సోయాబీన్ 35,203
పత్తి 1,060
కంది 986
పెసర 160
మినుము 191
చెరుకు 130
జిల్లాలో ప్రధాన పంటల సాగు ఇలా..
మొక్కజొన్న, సోయా జోరు
జిల్లా రైతులు వరి తర్వాత మొక్కజొన్న, సోయాబీన్ పంటల ను అధికంగా సాగు చేస్తున్నారు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో పాటు వాతావరణం కలిసి రావడంతో ఈ రెండు పంట లు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమృద్ధిగా సాగుతున్నా యి. అంచనాకు మించి జిల్లాలో సాగవుతున్నాయి. మొక్కజొ న్న పంట పలు ప్రాంతాల్లో చేతికి వచ్చింది. త్వరలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. సోయా ఆశించిన దానికన్నా ఎక్కువ కాత రావడంతో దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మార్కెట్‌లో మంచి రేటు దక్కేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.


