నిజామాబాద్‌అర్బన్: రాష్ట్రంలో పాలన కుప్పకూలిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. మాజీ మేయర్ నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ట్రెసా రాష్ట్ర కార్యదర్శిగా రమణ్‌రెడ్డి
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీ సెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన రమణ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా ట్రెసా అధ్యక్షుడిగా పని చేసిన రమణ్‌రెడ్డి గత కొంత కాలంగా మంత్రులు, ఉన్నతాధికారులను కలుస్తూ రెవె న్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కో సం కృషి చేస్తున్నారు. రమణ్‌రెడ్డి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టనుండడంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు సంఘం నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్‌రావు, బాలరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
వేల్పూర్(బాల్కొండ): ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్ భుజంగరావు పరిశీలించా రు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల నమో దు, సవరణకు సంబంధించిన వివరాలను బీఎల్‌వోల ద్వారా తెలుసుకున్నారు. ఫామ్ – 6,7,8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణను పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ యన వెంట ఆర్.ఐ. గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ సాయి ఉన్నారు.
మైనారిటీ గురుకులం తనిఖీ
బాల్కొండలోని మైనారిటీ గురుకులాన్ని అదనపు కలెక్టర్ భుజంగరావు తనిఖీ చేశా రు. భోజనం నాణ్యతపై విద్యార్థులను అడి గి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి యూని ఫామ్‌ను సకాలంలో అందించాలని వార్డెన్ భాగ్యలక్ష్మికి సూచించారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించారు.


