కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొట్టామని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా భీమ్‌గల్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌తో కలిసి నగే ష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత కోసం ఉద్యోగాలు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, క్రీడలు, పారిశ్రామిక అవకాశాలు వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను కల్పించినట్లు పేర్కొన్నారు. 2024 డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహించామని, అధికారం చేపట్టిన ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలి పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చి గ్రూప్ –1, 2, 3 వంటి నియామక పరీక్షలను నిర్వహించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. 2026–27 బడ్జెట్‌లో రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో క్రీడలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ప్రతి రంగంలో యువతకు అవకాశాలు క ల్పిస్తూ యువ తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి, వైస్ చైర్‌పర్సన్ సంటి లత, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, నాయకులు బొదిరే స్వామి, కన్నె సురేందర్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
యువ తెలంగాణ నిర్మాణానికి
ప్రభుత్వం కృషి
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో వృత్తి నైపుణ్యాలు
డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి


