ఉదయం 5 గంటల నుంచే రెక్కీ..! | - | Sakshi
Sakshi News home page

ఉదయం 5 గంటల నుంచే రెక్కీ..!

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని మా తా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) నుంచి కిడ్నాప్‌ అయిన బాలుడు వేదాన్ష్‌ను పోలీసు లు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితులైన మెదక్‌ జిల్లా నిజాంపేట్‌కు చెందిన కోతడి సుజాత, కోతడి ఎల్లం దంపతులను పోలీసులు విచారిస్తున్నారు. మేడ్చల్‌ నుంచి నిజామాబాద్‌కు శనివారం తెల్లవారుజామునే చేరుకున్న సుజాత, ఎల్లం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 5గంటల నుంచే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోని అన్ని విభాగాలతోపాటు, అక్క డ రద్దీ, సెక్యూరిటీ, ఒక వేళ పిల్లలను కిడ్నాప్‌ చేస్తే ఎక్కడి నుంచి ఎలా వెళ్లిపోవాలని పక్కా ప్లా న్‌ రూపొందించుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తిరిగి 10గంటల ప్రాంతంలో ఎంసీహెచ్‌కు చేరుకున్న దంపతులు ప్రసూతి విభాగం వద్ద అన్నాదమ్ములు వేదాన్ష్‌, నియాన్ష్‌ను గమనించి చాక్లెట్‌ ఆశ చూపారు. మొదట పిల్లలిద్దరూ సదరు మహిళ వెంట వెళ్లినప్పటికీ.. కొద్దిసేపటికే నియాన్ష్‌ వెనక్కి వచ్చి తన తల్లికి విషయం తెలిపాడు. 5 నిమిషాల్లోనే బాలుడు కనిపించకుండాపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి ప్రవేశ మార్గం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో బాబుని ఎటు వైపు తీసుకెళ్లారని గుర్తించేందు కు పోలీసులు మొద ట ఇబ్బంది పడ్డారు. అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా పులాంగ్‌ ప్రాంతం వరకు ఆటోలో వెళ్లి అక్కడి నుంచి మరో ఆటోలో డిచ్‌పల్లి వరకు వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు. అక్కడి నుంచి బస్సులో మెదక్‌కు ఆ తరువాత సంగరెడ్డి జిల్లా దౌల్తాబాద్‌ వెళ్లినట్లు గుర్తించారు. సీసీఎస్‌, ఒకటో టౌన్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలో రికార్డయిన చిత్రాలు మీడియాతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దౌల్తాబాద్‌లో నిందితులను గుర్తించిన ఒకరు పోలీసులకు సమాచారం అందించగా, సంగారెడ్డి పోలీసులతో కలిసి జిల్లా నుంచి వెళ్లిపోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. పోలీసులు కిడ్నాప్‌ వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

బాలుడు వేదాన్ష్‌ను 5 నిమిషాల్లో కిడ్నాప్‌ చేసిన దంపతులు

సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో

ఆచూకీ గుర్తింపు

క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement