నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

మాక్లూర్‌: పోలీసుశాఖ నిర్వహించనున్న ఉచిత పోలీస్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య అన్నారు. పోలీస్‌ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మండలంలోని దాస్‌నగర్‌ వద్దగల విజయ్‌ రూరల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరై పరీక్ష తీరును పరిశీలించారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి పోలీస్‌ కానిస్టేబుల్‌, ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్‌ ఈవెంట్స్‌పై పూర్తిస్థాయిలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంబంధిత అధికారి తెలిపారు. అదనపు డీసీపీ శుభం ప్రకాష్‌, ఎస్సైలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

మండలాల్లో ప్రజావాణి

నిజామాబాద్‌అర్బన్‌: ఇక నుంచి ప్రతి సోమవారం మండలస్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ విన్నపాలను మండలస్థాయిలో సమర్పించాలన్నారు. కాగా జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు. మండలస్థాయి అధికారులు విన్నపాలను స్వీకరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement