రేపు గవర్నర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

రేపు గవర్నర్‌ రాక

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకేంద్రానికి ఈనెల 25న రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్ల రానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం హెలికాప్టర్‌లో ఆయన బయలుదేరి, జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకోను న్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకొని, యాంటిడ్రగ్‌ అవేర్‌నేస్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఆర్యనగర్‌లోని పసుపుబోర్డు కార్యాలయంలో ని ర్వహించే వివిధ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం వద్ద గల పీహెచ్‌ఆర్‌ కన్వెషన్‌లో నిర్వహించే సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి మళ్లీ కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేస్తున్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలో ఆదివారం బాసర జోన్‌ ప్రోహిబిషన్‌, ఎకై ్సజ్‌శాఖ హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌గా చంద్రమోహన్‌, కై లాస్‌ పవర్‌ పోటీపడగా ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో, డ్రా పద్ధతిలో కై లాస్‌ పవర్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. వైస్‌ చైర్మన్‌గా లింబాద్రి ఎన్నికయ్యారు. కోశాధికారిగా చల్లబాబు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మ ల్‌, జగిత్యాల్‌ జిల్లాలకు చెందిన అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యు లు ఓట్లు వేశారు. ఎలక్షన్‌ అధికారిగా విలాస్‌, బాలకిషన్‌ వ్యవహరించారు.

‘22 ఏ’ భూములపై చర్చకు సిద్ధమా?

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌ నగరం పరిధిలోని 22 –ఏ భూముల అంశంపై తా ను బహిరంగ చర్చకు సిద్ధమని, ఎక్కడికి రమ్మన్నా వస్తానని బీజేపీ జిల్లా అద్యక్షుడు దినేశ్‌పటేల్‌ కులాచారి అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆ దివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 22–ఏ అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఎవరైనా చర్చకు రావొచ్చన్నారు. 22–ఏ కారణంగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స మస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి రాజకీయ పార్టీకి హక్కు అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌ ప్రమోద్‌కుమార్‌, డిప్యుటీ ఫ్లోర్‌ లీడర్‌ దాంపల్లి జ్యోతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరే టర్లు, మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీలోకి

స్వల్ప ఇన్‌ఫ్లో

వేల్పూర్‌(మెండోరా): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో 1013 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో రాగా.. రాత్రి సమయానికి 2,640 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో ప్రస్తు తం 44.266 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసె క్కు లు, మిషన్‌ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 482 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

‘సాగర్‌’లోకి 1,069..

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1,069 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు దంచికొడుతుండటంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోందని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.88 అడుగుల (12.330 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement