జిల్లాలో ఇందిరమ్మ టవర్స్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇందిరమ్మ టవర్స్‌

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలసి జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలోనే జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు మెడికల్‌ కళాశాల మంజూరైందన్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌ తర్వాత జిల్లాలోనే హైరైజ్‌ భవనాలను నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. మొదటి విడతలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం చేపడుతామన్నారు. నిజామాబాద్‌ నగరా నికి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు. కార్పొరేషన్‌ హోదా ఉన్న నిజామాబాద్‌ను బీఆర్‌ఎస్‌ కనీసం స్మార్ట్‌సిటీగా చేయలేకపోయిందని విమర్శించారు. రానున్న రెండున్నరేళ్లలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

సకల వసతులతో యంగ్‌ ఇండియా స్కూళ్లు

అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించేందుకు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కమీషన్లు, స్వార్థం కోసమే ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్‌, గన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

వైఎస్సార్‌ హయాంలో

యూనివర్సిటీ ఏర్పాటు

టీపీసీసీ అధ్యక్షుడు,

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement