కష్టపడే వారికే ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

కష్టపడే వారికే ప్రాధాన్యత

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

70 శాతం పదవులు పాతవారికే..

వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి

తిరిగి అధికారంలోకి వస్తాం

టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ

మహేశ్‌కుమార్‌గౌడ్‌

నిజామాబాద్‌ రూరల్‌: కాంగ్రెస్‌లో కష్టపడిన కార్య కర్తలకు పదవుల్లో ప్రాధాన్యత లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణమండపంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో కింది స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాలని డిమాండ్‌ వస్తోందని, పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామన్నారు. కార్యకర్తల కృషితోనే పార్టీకి అధికారం వచ్చిందని, 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జీతో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ స్థాయిలో అనుసరిస్తున్న విధా నం కూడా ఇదేనని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌తోపాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తామ ని స్పష్టం చేశారు. మార్కెట్‌ కమిటీలకు సంబంధించి అప్రూవల్‌ ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వంద సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రైతు కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌, మానాల మెహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌, సునీల్‌కుమార్‌రెడ్డి, విపుల్‌గౌడ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement