లక్షల ఓట్లు అవుట్‌! | - | Sakshi
Sakshi News home page

లక్షల ఓట్లు అవుట్‌!

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

వాతావరణం

ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.

భీమ్‌గల్‌ అభివృద్ధిపై..

భీమ్‌గల్‌లో అభివృద్ధి పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.

గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 8లో u

3.91

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లను అధికారులు తొల గించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఏకంగా 3,91,453 ఓట్లు తొలగింపు ముప్పులో ఉన్నాయి. సెప్టెంబర్‌ 16 లోపు ఎన్నికల సంఘం అధికారులు జారీ చేసిన నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వక పోతే వీరందరి ఓట్లు గల్లంతు కానున్నాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ముందు జిల్లావ్యాప్తంగా మొత్తం 14,39,734 ఓట్లు ఉండగా.. ఈనెల 17న ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదాలో ఓట్ల సంఖ్య 12,28,064కు తగ్గింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తర్వాత 2,11,670 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మరో 3.91 లక్షల ఓట్ల వివరాల్లో వ్యత్సాసాలు ఉండటంతో అనామలీస్‌ జాబితాలో చేర్చారు. వీరందరికీ నోటీసులు జారీ చేయనుండగా నెల రోజుల్లోగా సమాధానం రాకపోతే ఈ ఓట్లు సైతం తొలగిపోనున్నాయి.

అర్బన్‌లో అత్యధికంగా..

జిల్లాలోనే నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 87,764 ఓట్లను అనామలీస్‌ జాబితాలో చేర్చారు. ఇప్పటికే 83,282 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారు. చాలాకాలంగా చిరునామాలో లేకపోవడం, చిరునామా మారడం, చనిపోవడం, మరో చోట ఓటు ఉండటం వంటి కారణాలతో ఈ ఓట్లను తొలగించారు. ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 21,950 ఓటర్ల వివరాలు అన్‌మ్యాపింగ్‌గా చూపించారు. ఓటరు జాబితాతో సంబంధిత వ్యక్తుల వివరాలు, చిరునామా మ్యా పింగ్‌ సరిపోకపోవడంతో వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించారు. అర్బన్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 41,919 మంది ఓటర్లు ఆచూకీ లేకపోవడంతో జాబితా నుంచి తొలగించారు. మరో 15,099 మంది మరోచోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో తొలగించారు. 12,175 మందికి డబుల్‌ ఓట్లు ఉండటంతో జాబితా నుంచి తొలగించారు. తర్వాత నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో అధికంగా 74,253 మంది, బాల్కొండ నియోజకవర్గంలో 61,894 మంది, ఆర్మూర్‌ నియోజకవర్గంలో 59,551 మంది, బోధన్‌ నియోజకవర్గంలో 57,678 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాల కారణంగా అనామలీస్‌ జాబితాలో చేర్చారు. సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాలను స్వీకరించనుండగా, ఆ తర్వాత ఆయా కేటగిరీ ఓట్ల తొలగింపు ఖాయం కానుంది. తర్వాత అక్టోబర్‌ 19న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.

ఫారాల సమర్పణకు నిరాసక్తత

జిల్లావ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటు హక్కు పునరుద్ధరణకు ఎన్యుమరేషన్‌ ఫారాలను సమర్పించేందుకు వృద్ధులు, యువ ఓటర్లు నిరాసక్తతను ప్ర దర్శించారు. చాలావరకు ఓటర్లు ఫామ్‌లు తీసుకున్నప్పటికీ వాటిని నింపడం, తిరిగి బీఎల్‌వోలకు సమర్పించే విషయంలో అలసత్వం ప్రదర్శించారు. దీంతో ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్ర క్రియ ఎక్కడా 89 శాతం దాటలేదు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో ఫారాల డిజిటలైజేషన్‌ కేవలం 72.98 శాతం మాత్రమే పూర్తయ్యింది. ఇక్క డ 39.01 శాతం ఓటర్లకు సంబంధించి వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

నియోజకవర్గం ఫామ్‌లు మరణించిన అందు బాటులో ఇతర ప్రాంతాలకు ఇతరులు వివరాలు సక్రమంగా

ఇవ్వనివారు వారు లేని వారు వెళ్లినవారు లేని ఓటర్లు

ఆర్మూర్‌ 25729 6185 1647 9911 61 59549

బోధన్‌ 27808 5397 4576 12997 17 57664

బాన్సువాడ 19882 3962 843 9877 43 50299

ని.అర్బన్‌ 83282 5384 41919 15099 8705 87681

ని.రూరల్‌ 31145 6902 1091 14364 66 74250

బాల్కొండ 23824 5882 1586 9322 31 61887

మొత్తం 211670 33712 51662 71570 8923 391330

తేడాలు ఉంటే రుజువు చేసుకోవాల్సిందే

ఓటరు జాబితాతోపాటు ఎన్యుమరేషన్‌ ఫారా ల్లో ఏమాత్రం తేడాలు కనిపించినా ఆయా ఓటర్లను అనామలీస్‌ జాబితాలో చేర్చారు. జిల్లాలో వీటి సంఖ్యే ఏకంగా 3,91,453కు చేరింది. వీరంతా తమ ఓటుహక్కుకు కావా ల్సిన అధారాలను ఎన్నికల అధికారులకు సమర్పించుకోవాల్సి ఉంది. 2002 నాటి ఓట రు జాబితా వివరాలతో నాటి కుటుంబ సభ్యు ల వివరాల జాబితాతో యువఓటర్ల జాబితాను పోల్చారు. ఈ ప్రక్రియలో పుట్టిన తేదీ వివరాల్లో ఒక బిడ్డకు మరో బిడ్డకు మధ్య 9 నెలల కన్నా తక్కువ గ్యాప్‌ ఉన్నా, తల్లిదండ్రులకు సంతానానికి మధ్య 15 ఏళ్ల వయస్సు కన్నా తక్కువ వ్యత్సాసం ఉన్నా, ప్రస్తుత ఓటరు వయస్సు తమ నాయనమ్మ, తాతయ్య వయస్సుకు 40 ఏళ్ల లోపు వ్యత్యాసం ఉన్నా అనామలీస్‌ జాబితాలో చేర్చారు. పేర్లు, ఇంటిపేర్లలో తప్పులు, వ్యత్యాసాలు ఉన్నా వారి పేర్లను అనుమానాస్పద ఓటర్ల జాబితాలో చేర్చారు.

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ఇలా..

నిజామాబాద్‌ అర్బన్‌లోనే అత్యధికంగా 83 వేల ఓట్లు

ఆచూకీ లేని ఓటర్లు 41,919 మంది

అనామలీస్‌ జాబితాలో

పెద్ద సంఖ్యలో ఓట్లు

సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాల

స్వీకరణ

అక్టోబర్‌ 19న తుది ఓటరు

జాబితా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement