సమన్వయంతో అటవీ సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో అటవీ సంరక్షణ

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిజామాబాద్‌ అర్బన్‌: అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఆయా శాఖలు సమన్వయంతో కృషి చే యాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవా రం కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సి న చర్యలు, అటవీ భూముల ఆక్రమణల నిరోధం, వన్యప్రాణుల సంరక్షణ, అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులకు అవకాశం లేకుండా జాగ్రత్త లు చేపట్టడం, వనమహోత్సవం ద్వారా విరి విగా మొక్కలు నాటడం, జల సంరక్షణ కార్యక్రమాల అమలు, వాల్టా చట్టం అమలు, అనువైన అటవీ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం తదితర అంశాలపై చర్చించారు.

జిల్లాలో అటవీ ప్రాంతం, పరిస్థితులను డీఎఫ్‌వో ప్రశాంత్‌పాటిల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. సిరికొండ, కమ్మర్‌పల్లి, కాల్పోల్‌ తండా, డీబీ తండా, చందూర్‌ తదితర ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, కబ్జాదారులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల తోడ్పాటు అవసరం ఉందన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ.. అటవీ ప్రాంత సంరక్షణకు ఆయా శాఖలు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు తగిన సహకారం అందించేలా చూస్తామన్నారు. అ టవీ భూములను కబ్జా చేస్తే కఠిన చట్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూ చించారు. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. అటవీశాఖ ఆ ధ్వర్యంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదనలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి తోడ్పాటునందిస్తామన్నా రు. అదనపు కలెక్టర్‌ వి భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, ఏసీపీలు ప్రకాశ్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, అటవీ, పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement