ప్రతి సామాన్యుడి ఓటూ కీలకమే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతి సామాన్యుడి ఓటూ కీలకమే..

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

నిజామాబాద్‌ రూరల్‌ : ఎన్నికల్లో ప్రతి సామాన్యుడి ఓటూ కీలకమేనని, అర్హులందరికీ ఓటు హక్కు క ల్పించే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మా ట్లాడుతూ.. ఓటర్ల జాబితా ముసాయిదాలో అర్హులైన వారి పేర్లు గల్లంతైతే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ ఫేస్‌–2లో ఓట ర్ల జాబితా ముసాయిదాను ప్రతి నాయకుడు, కార్యకర్త పరిశీలించాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు. బూత్‌ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఓటరుకు ఓటు హక్కు ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 1.50 లక్షల ఓట్లు ముసాయిదా జాబితాలో గల్లంతైనట్లు గుర్తించామని ప్ర భుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పేర్కొ న్నారు. జహీరాబాద్‌ ఎంపీ సురే శ్‌ షెట్కార్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, నిజామాబాద్‌ మేయర్‌ ఉమారాణి, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌, కాంగ్రెస్‌ నేతలు మానాల మోహన్‌రెడ్డి, గడుగు గంగాధర్‌, సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌, యూసు ఫ్‌ అలీ, కాసుల బాల్‌రాజు, అరికెల నర్సారెడ్డి, ఆకు ల లలిత, శేఖర్‌గౌడ్‌, కేశ వేణు, ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనకరంగా ఎస్‌ఐఆర్‌

నిజామాబాద్‌ రూరల్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ఆందోళనకరంగా ఉందని, జిల్లాలో 20శాతం ఓట్లు తొలగించారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నట్లు తెలిసింది. సర్‌ ఫేజ్‌–2పై నగరంలోని ఓ ఫంక్షన్‌ హాలులో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనికి ముందు నిర్వహించిన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తోందని, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే జేబు సంస్థలుగా మార్చుకుందని ఆరోపించినట్లు తెలిసింది. జిల్లాలో ఏకంగా 40 శాతం ఓటర్లకు నోటీసులు జారీ చేయడం ఆందోళనకర పరిణామమని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని సమావేశంలో నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది.

అందరికీ ఓటు హక్కు కల్పించే

బాధ్యత మనదే

ఇన్‌చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ

అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌

‘సర్‌’పై ఉమ్మడి జిల్లా

కాంగ్రెస్‌ నాయకుల సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement