గాంజా.. ‘విద్యార్థులపై’ పంజా | - | Sakshi
Sakshi News home page

గాంజా.. ‘విద్యార్థులపై’ పంజా

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

యువతరమే లక్ష్యంగా విక్రయాలు

మత్తులో నేరాలకు పాల్పడుతున్న వైనం

విక్రయిస్తూ పట్టుబడుతున్న వారిలో మైనర్లు, మహిళలే అధికం

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లాలో గంజాయి విక్రయా లు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నా.. గంజా విక్రయ ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. విద్యార్థులు, యువతే లక్ష్యంగా చేసుకుంటున్న ముఠాలు.. పాఠశాలలు, కళాశాలల సమీపంలో చాక్లెట్ల రూపంలో గంజాయిని అలవాటు చేస్తూ వారిని పెడదారి పట్టిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్‌, బాల్కొండ, భీమ్‌గల్‌, డిచ్‌పల్లి, బోధన్‌ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.200 నుంచి రూ.300 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ నగరంలోని హైదరాబాద్‌ రోడ్‌లోని రెండు పాన్‌ కోకాలు, ప్రధాన బస్టాండ్‌, మిర్చి కంపౌండ్‌, అర్సపల్లి, మాలపల్లి తదితర పరిసర ప్రాంతాల్లో గంజాయి సిగరెట్‌, చాక్లెట్ల రూపంలో లభిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల మిర్చి కంపౌండ్‌లో ఇద్దరు యువకులు, మూడో టౌన్‌ పరిధిలో గంజాయి సేవిస్తున్న మరో ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకోవడమే అందుకు నిదర్శనం.

దాడులు చేసినా ఆగని దందా..

గంజాయి నిరోధానికి పోలీసు, ఎకై ్సజ్‌ శాఖలు సంయుక్తంగా దాడులు చేస్తున్నా విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల వర్నిలో 38 కిలోలు, రుద్రూర్‌లో 5 కిలోలు, పొతంగల్‌లో 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు ఒడిశా నుంచి 24 కిలోల గంజాయిని తీసుకువచ్చి పోలీసులకు దొరికిపోయారు. మహిళలను విచారించగా కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఓ వ్యక్తితో కలిసి గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడైంది. సదరు వ్యక్తి జిల్లా కేంద్రంలోని కళాశాలలు, పాఠశాలల వద్ద ప్యాకెట్ల రూపంలో గంజాయిని విక్రయించినట్లు తెలిసింది. మరోవైపు గంజాయి విక్రయాలకు కొన్ని ముఠాలు మైనర్లను వాడుకుంటున్నాయి. ఆరో టౌన్‌ పరిధిలో ఇటీవల ముగ్గురు, ఐదౌ టౌన్‌ పరిధిలో ఇద్దరు మైనర్లు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. జిల్లాకు గంజాయి తీసుకువస్తూ ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు బిహార్‌కు చెందిన ఓ మైనర్‌ పట్టుబడటంతో అసలు విషయం బయటికొచ్చింది.

మూడేళ్లలో పట్టుబడ్డ మత్తు పదార్థాలు, నమోదైన కేసులు

సంవత్సరం గంజాయి ఆల్ప్రాజోలం నమోదైన అరెస్టులు

(కేజీల్లో) (కేజీల్లో) కేసులు

2024 41.202 3.64 23 55

2025 15.64 35.96 90 211

2026(ఏప్రిల్‌ వరకు) 28.5 20.23 42 62

అవగాహన కల్పిస్తూనే.. చర్యలు

గంజాయి అరికట్టేందుకు కృషి చేస్తున్నాం. పోలీసు శాఖ సమన్వయంతో దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నాం. మరోవైపు అవగాహన సైతం కల్పిస్తున్నాం. గాంజా కేసుల్లో మైనర్లు కూడా వెలుగులోకి వస్తున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. రెండోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నాం.

– అరుణ్‌ కుమార్‌, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement