ఒకే విద్యార్థికి రెండు ఆధార్‌లు | - | Sakshi
Sakshi News home page

ఒకే విద్యార్థికి రెండు ఆధార్‌లు

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఒక విద్యార్థికి రెండు ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయి. మాక్లూర్‌ మండలం గంగరమంద గ్రామానికి చెందిన గంగాధర్‌ తన కుమారుడు కుషాల్‌ ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేయించేందుకు రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం వద్ద ఉన్న మీ సే వ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. పాత ఆధా ర్‌ కార్డు అప్‌డేట్‌ కోసం వెళితే అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌లో నంబర్‌ కనిపించడం లేదని, కొత్త ఆధార్‌ కా ర్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో గంగాధర్‌ తన కు మారుడికి కొత్త ఆధార్‌ కా ర్డు కోసం మళ్లీ దరఖా స్తు చేశాడు. ఆ తరువాత కొత్తదానితోపాటు పాత కార్డు డౌన్‌లోడ్‌ అయ్యింది. అ యితే పాఠశాలలో టీచర్లకు ఆన్‌లైన్‌లో విద్యార్థి ఆ ధార్‌నంబర్‌ కనిపించలేదు. తన కుమారుడి చదువు ఎలా అని గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement