ఖరీఫ్‌ పంటలను గట్టెక్కిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ పంటలను గట్టెక్కిస్తాం

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

నిజాంసాగర్‌(జుక్కల్‌): వర్షాభావం, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టు కింద సాగు చేసి న వానాకాలం పంటలను ‘సాగర్‌’ జలాలతో గట్టెక్కిస్తామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. అలీసాగర్‌ రిజర్వాయర్‌ వరకు అధికారికంగా 1.25 లక్షలు, అనధికారికంగా 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. ఆయక ట్టు కింద సాగు చేస్తున్న పంటలకు నాలుగు విడతల్లో 5 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం సా నుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గురువారం నిజాంసాగర్‌ ప్రాజెక్టును పోచారం శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు నీటిమట్టం, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వివరాలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోచారం మాట్లాడారు. జూన్‌, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. బోరుబావుల వద్ద వరి నారుమడులు వేసుకున్న బా న్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల రైతులు ముందస్తుగానే నాట్లు వేశారని చెప్పారు. దీంతో ప్రాజెక్టు నీటిని అందించి నిజాంసాగర్‌ ఆయకట్టు పంటలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, సీఈని కోరినట్లు చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 6 టీఎంసీల మేర వరద నీరు చేరడంతో ఆయకట్టుకు భరోసా కల్గిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయకట్టుకు 5 టీఎంసీలు నాలుగు విడతల్లో ప్రధాన కాలువ ద్వారా అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నీటి విడుదలకు అనుమతినిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల బిచ్కుందకు వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి సిద్దాపూర్‌ రీడిజైన్‌కు అనుమతించాలని కోరినట్లు చెప్పారు. రీడిజైన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి ఇస్తామని సీఎం చెప్పారన్నారు. జాకోరా, చందూర్‌ లిఫ్టుల నిర్మాణ పనులు చేపడుతుండటంతో 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పంట పండించడంతోపాటు వరిధాన్యం సేకరణలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో 1.45 లక్ష ల ఎకరాలకు వందకు, వందశాతం సాగునీటి వస తి కల్పిస్తున్న ఘనత ఉందన్నారు. ఆయన వెంట నిజాంసాగర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రజా పండరి, బాన్సువాడ నాయకులు జంగం గంగాధ ర్‌, ఎజాజ్‌, కృష్ణారెడ్డి, మోహన్‌నాయక్‌, కమ్రు, నా ర్ల రవీందర్‌, రఘు, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ ప్రవీణ్‌ కుమార్‌, ఏఈలు సాకేత్‌, అక్షయ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కాశీనాథ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement