ఆధ్యాత్మిక సేవలో తపాలా | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక సేవలో తపాలా

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

పోస్టాఫీసులో గంగాజలం

గంగోత్రి నుంచి బాటిళ్లలో సరఫరా

250 మిల్లీ లీటర్ల బాటిల్‌ రూ.30

దేశ, విదేశాలకు రాఖీ పార్సిళ్లు

సద్వినియోగం చేసుకోవాలి

పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ ఫర్‌లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. పవిత్ర గంగాజలం ఇప్పుడు జిల్లా కేంద్రంలోని హెడ్‌పోస్టాపీసులో అందుబాటులో ఉంది. రాఖీ పార్సిళ్లను తమవారికి పోస్ట్‌ద్వారా పంపించవచ్చు. పోస్టల్‌ ద్వారా కచ్చితమైన, పారదర్శకంగా సేవలందుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రజలు నమ్మకం పెంచుకోవాలి.

– అజయ్‌, పోస్ట్‌మాస్టర్‌, హెడ్‌ పోస్టాఫీస్‌

నిజామాబాద్‌ రూరల్‌: పోస్టాఫీస్‌ అంటే ఠక్కున గుర్తుకువచ్చేది ఉత్తరాలు, పార్సిళ్లు. అయితే కాలాని కి అనుగుణంగా తపాలా వ్యవస్థలోనూ అనేక మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్‌ రంగంలోని కొరియర్‌, బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌ సంస్థలకు దీటుగా పోస్టల్‌ సేవలందిస్తోంది. ఇప్పటికే భ ద్రా ద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలను ఇంటికే డెలివరీ ఇస్తుండగా.. శ్రావణ మాసం సందర్భంగా తాజాగా గంగోత్రి నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చి పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచింది. రూ.30 చెల్లించి జిల్లా కేంద్రంలోని హె డ్‌ పోస్టా ఫీసులో 250 మిల్లీ లీటర్ల పవిత్ర గంగాజలాన్ని పొందొచ్చు.

ప్రత్యేకంగా ‘రాఖీ’ కవర్లు

దేశ, విదేశాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రక్షాబంధన్‌ సందర్భంగా రాఖీలు పంపించేందుకు వీలుగా తపాలా సేవలందిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు స్పీడ్‌పో స్ట్‌ ద్వారా, 130కి పైగా విదేశాలకు ఐటీపీఎస్‌ (ఇంటర్నేషనల్‌ ట్రాక్డ్‌ ప్యాకెట్‌ సర్వీస్‌) ద్వారా రాఖీలు, గిఫ్ట్‌లను తమ ఆత్మీయులకు పంపించవచ్చు. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా రాఖీ పార్సిళ్లపై 10శాతం రాయితీ సైతం ఇస్తోంది. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పోస్టాఫీసుల్లో స్పీడ్‌పోస్ట్‌ బుకింగ్స్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement