3 రోజులు.. 446 నోటీసులు | - | Sakshi
Sakshi News home page

3 రోజులు.. 446 నోటీసులు

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

ఇంకా 4,31,959 మందికి

జారీ కానున్న నోటీసులు

నిజామాబాద్‌ అర్బన్‌, బాన్సువాడ

నియోజకవర్గాల్లో ఒక్క నోటీసూ ఇవ్వలే..

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కీలకమైన రెండో దశకు చేరుకుంది. వివరా లు సక్రమంగా లేని, ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వ ని వారికి నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,32,405 మంది ఓటర్లకు నోటీసులు సి ద్ధం చేశారు. అయితే జిల్లాలో నోటీసుల జారీ ప్రక్రి య నత్తనడకన సాగుతోంది. మూడు రోజుల్లో ఆ యా నియోజకవర్గాల పరిధిలో కేవలం 446 మంది ఓటర్లకే నోటీసులు జారీ చేశారు. ఓటరు ముసాయి దా జాబితాలో కొందరు ఓటర్ల పేర్లలో అక్షరదోషా లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఫారం–8 ద్వారా సవరించుకునేందుకు అవకాశం కల్పించారు.

మండలాల వారీగా..

సర్‌ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ చాలా నె మ్మదిగా సాగుతోంది. నిజామాబాద్‌ అర్బన్‌, బా న్సువాడ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నోటీసు జారీ కాలేదు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలంలో ఒకరికి నోటీసు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గంలో 104 నోటీసులు జారీ కాగా, బాల్కొండలో 6, ముప్కాల్‌ 6, మెండోరా 2, మోర్తాడ్‌ 4, ఏర్గట్ల 55, కమ్మర్‌పల్లి 9, భీంగల్‌ 8, వేల్పూర్‌ 14 ఉన్నాయి. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ పట్టణంలో మాత్రమే 5 నోటీసులు జారీ చేశారు. బోధన్‌లో మొత్తం 336 మంది ఓటర్లకు నోటీసులు అందజేయగా వారంతా బోధన్‌ మండలానికి చెందినవారే కావడం గమనార్హం.

‘సర్‌’ నోటీసుల జారీ వివరాలు

అలీసాగర్‌ వరకు 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం

సిద్దాపూర్‌ రీడిజైన్‌కు సీఎం సానుకూలం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement