హైవేపై సేఫ్టీ కోన్స్‌ ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

హైవేపై సేఫ్టీ కోన్స్‌ ధ్వంసం

Aug 17 2026 12:41 AM | Updated on Aug 17 2026 12:41 AM

హైవేపై సేఫ్టీ కోన్స్‌ ధ్వంసం మానవత్వం చాటిన ఖతార్‌ తెలుగు సమాజం ఇంటి గేటు ముందే స్తంభం

వేల్పూర్‌: మండలంలోని అంక్సాపూర్‌ గ్రామంలో 63వ నంబరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సేఫ్టీ కోన్‌లు ధ్వంసమయ్యాయి. హైవేపై ప్రమాదాలు జరిగే స్పాట్లను ఇటీవల సీపీ సాయిచైతన్య గుర్తించి, నివారణ చర్యలు చేపట్టారు. అందులోభాగంగా వేల్పూర్‌ మండలం వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద, అంక్సాపూర్‌ వద్ద సేప్టీ కోన్స్‌ ఏర్పాటు చేశారు. వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద బాగుండగా, అంక్సాపూర్‌ గ్రామంలో వాహనాలు ఢీకొంటూ వెళ్లడం వల్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంక్సాపూర్‌లో జాతీయ రహదారికి ఇరువైపులా గృహాలు ఉండడం, వ్యవసాయ పనుల కోసం గ్రామస్తులు రెండు వైపులా అధికంగా వెళ్తుంటారు. సేప్టీ కోన్‌లు ఉండడం వల్ల వాహనాలు తక్కువ వేగంతో జాగ్రత్తగా వెల్లేవి. సేప్టీ కోన్స్‌ ధ్వంసం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వేగంగా వెళ్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

బాధిత కుటుంబానికి రూ.11 లక్షల ఆర్థిక సాయం అందజేత

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఖతార్‌ దేశంలో ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబానికి ఖతార్‌ తెలుగు స మాజం ఆర్థికసాయం అందించింది. వివరాలు ఇలా..మండలంలోని నర్సింగ్‌పూర్‌(కొత్తపేట్‌) గ్రామానికి చెందిన సుంకే మల్లేష్‌ (46) ఖతార్‌ దేశంలో డ్రైవర్‌గా పనిచేస్తూ జూలై 23న గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఖతర్‌లోని ఆంధ్ర కళావేదిక, తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్‌ సహకారంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపించారు. తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, తెలంగాణ గల్ఫ్‌సమితి తదితర సంఘాలు స్పందించి మృతుడి కుటుంబానికి బాసటగా నిలిచారు. గల్ఫ్‌ సంఘాల ఆధ్వర్యంలో రూ.11 లక్షల విరాళాలు పోగుచేసి మృతుడి కుటుంబానికి పంపించారు. డిచ్‌పల్లి మాజీ ఎంపీపీ గద్దె భూమన్న ఆదివారం నర్సింగ్‌పూర్‌ గ్రామానికి వెళ్లి బాధి త కుటుంబానికి ఖతర్‌ నుంచి వచ్చిన విరాళాన్ని అందజేశారు. బాధిత కుటుంబసభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సింగ్‌పూర్‌ సర్పంచ్‌ శోభ, సొసైటీ మాజీ చైర్మన్‌ చిన్నయ్య, మాజీ సర్పంచ్‌ నల్లవెల్లి సాయిలు, బీజేపీ నాయకులు వెంకటరమణ, కుందేటి బాలయ్య, సాయిలు, నర్సయ్య ఉన్నారు.

మాచారెడ్డి: మాచారెడ్డి మండలం రాజఖాన్‌ పేట గ్రామానికి చెందిన జోగులు కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఇంటి గేటు ముందే విద్యుత్‌ స్తంభం ఉండడంతో ఇంటి నిర్మాణాకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులకు విన్నవించినా స్పందించడంలేదని వాపోయాడు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement