జీవో 97ను రద్దు చేయాలి..
నిర్ణయాన్ని విరమించుకోవాలి
ఖలీల్‌వాడి : పాలిటెక్నిక్ విద్య బలోపేతం కోసమే శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనీషియేటివ్స్) విభాగంలో కలుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. విద్యార్థి సంఘాలు మాత్రం ప్రభుత్వం ప్రయివేటీకరణకు యత్నిస్తుందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్య భవిష్యత్ ఏమిటనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యాసంస్థలున్నా యి. ఇందులో 1,440 మంది విద్యార్థులు ఏటా పా లిటెక్నిక్ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా (లేటరల్ ఎంట్రీ) ఆడ్మిషన్ తీసుకునే వె సులుబాటు ఉంది. పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఎస్‌ఆర్) ఖరారు చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ ఇండియా యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుంది. విద్యాశాఖ నుంచి విడిపోతే స్కిల్ యూనివర్సిటీ పాలక మండలికి ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంటుంది.
విద్యార్థి సంఘాల నిరసన..
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘా లు కొన్నిరోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫీజులను పెంచితే సామాన్య విద్యార్థుల కు సాంకేతిక విద్య అందని ద్రాక్షలా మారే ప్రమా దం ఉంటుందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభు త్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట పాలిటెక్నిక్ విద్యను ప్రయివేటీకరణ చేస్తున్నారు. దీనికి తీసుకువచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలి. లేకుంటే విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తాం. శక్తిని రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి.
–రఘురామ్ నాయక్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్‌ఎఫ్
పాలిటెక్నిక్ కాలేజీలను ప్ర యివేటీకరణ చేయడానికి శక్తీ స్కీమ్ తీసుకువచ్చింది. దీంతో ఫీజులు పెరిగి పేద, మధ్య తరగతి, సామాన్య విద్యార్థులకు భారంగా మా రుతుంది. ప్రయివేట్‌కు కేటాయిస్తే రూ. కోట్లు విలు వ చేసే ప్రభుత్వ ఆస్తులు ధారదత్తం చేయాల్సి వ స్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి. –కైరి శశిధర్, కన్వీనర్,
ఇందూర్ విభాగ్, ఏబీవీపీ
‘శక్తి’లో కళాశాలల విలీనానికి
సర్కారు చర్యలు
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న
విద్యార్థి సంఘాలు
ప్రయివేటీకరణ ప్రయత్నమేనని ఆరోపణ


