ఆర్మూర్‌టౌన్: ఆర్మూ ర్ పట్టణానికి చెందిన తలారి తిరుపతి(60) అనే హెడ్ కానిస్టేబుల్ మంగళవారం ఉద యం గుండెపోటుతో మృతిచెందారు. పట్టణానికి చెందిన తిరుప తి రెంజల్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధు లు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆర్మూర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశా రు. ఉదయం ఇంట్లో తిరుపతి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా తిరుపతి అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.


