మీ ఓటు భద్రమేనా..? | - | Sakshi
Sakshi News home page

మీ ఓటు భద్రమేనా..?

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

మొబైల్‌ యాప్‌ ద్వారా.. బీఎల్‌వోల నుంచి..

జాబితాలో తప్పులు ఉంటే..

ఎల్లారెడ్డి: ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయా.. తమ పేరుతో వేరొకరు ఓటు నమోదు చేసుకున్నారా.. అనే సందేహాలు ఉంటే ఓటర్లు సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌, బీఎల్‌వో ద్వారా ఓటు వివరాలను పరిశీలించుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా...

● ఎన్నికల సంఘం అధికారిక ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌(voters.eci.gov.in)ఓపెన్‌ చేయాలి.

● సెర్చ్‌ ఇన్‌ ఎలెక్టరల్‌ రోల్‌ పై ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

● ఇక్కడ మూడు పద్ధతులలో ఓటును చెక్‌ చేసుకోవచ్చు.

● ఓటర్‌ కార్డు నంబర్‌, రాష్ట్రం పేరు ఎంటర్‌ చేసి చెక్‌ చేయాలి.

● మీ పేరు, తండ్రి పేరు, వయస్సు, నియోజకవర్గం వివరాలతో కూడా చెక్‌ చేయొచ్చు.

● మీ ఓటర్‌ కార్డుకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ను అందులో నమోదు చేయాలి. ఓటీపీ వచ్చాక ఓటరు వివరాలు వస్తాయి.

● జాబితాలో మీ పేరు కనిపిస్తే మీ ఓటు భద్రంగా ఉన్నట్లే.

● గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

● యాప్‌ ఓపెన్‌ చేసి సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలెక్టరల్‌ రోల్‌ పై క్లిక్‌ చేయాలి.

● మీ ఓటర్‌ కార్డుపై ఉండే బార్‌ కోడ్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే మీ ఓటు స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

మీ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌వో) ని సంప్రదించాలి. ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదా జాబి తాలో మీ పేరు ఉందో లేదో సరి చూసుకోవచ్చు.

అలాగే ఇదివరకు అందించిన ఎనుమ్యరైషన్‌ ఫారాలలో తప్పులు ఉంటే సవరణకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.

ఓటర్ల జాబితాలో తమ పేరు లేకున్నా, ఏ మైనా సవరణలు ఉన్నా సెప్టెంబర్‌ 16 వరకు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించాలి. ఈ నెల 22, 23, 29, 30వ తేదీ ల్లో మీ ఊరి పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. నేరుగా వెళ్లి సవరణల ఫారాలు అందించవచ్చు. 2026 అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని అధికారులు తెలిపారు.

ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోయినా, ఏవైనా సవరణలు ఉన్నా సెప్టెంబర్‌ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలు ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులలో తెలుసుకోవచ్చు. తుది ఓటరు జాబితా వరకు సవరణలకు అవకాశం ఉంటుంది.

– ప్రభాకర్‌, ఆర్టీవో, ఎల్లారెడ్డి

మూడు మార్గాల్లో

ఓటరు వివరాల పరిశీలన

సవరణలకు

సెప్టెంబర్‌ 16 వరకు గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement