ఏపీపీ రహీమొద్దీన్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఏపీపీ రహీమొద్దీన్‌ బదిలీ

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

ఏపీపీ రహీమొద్దీన్‌ బదిలీ

నిజామాబాద్‌ లీగల్‌: నిజామాబాద్‌ మొదటి అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు ఏపీపీగా ఉ న్న మహ్మద్‌ రహీమొద్దీన్‌ను ఎల్‌బీ నగర్‌ మెజిస్ట్రేట్‌ కో ర్టుకు బదిలీ చేస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎస్‌ సాంబశివరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆయన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బి చ్కుందలో 2015 సంవత్సరంలో మొదటిసారిగా ఏ పీపీగా చేరాడు. 2022లో నిజామాబాద్‌కు బదిలీపై వచ్చి ఏపీపీగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో పదోన్నతి పొందాల్సి ఉండగా ఆయనను ఎల్‌బీ నగర్‌ కోర్టుకు బదిలీ చేశారు. రహీమొద్దీన్‌ మరో ఏపీపీ రాహూల్‌ కు బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ కానున్నారు.

నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

వేల్పూర్‌: ఎస్సారెస్పీలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో నాలుగైదు రోజులుగా ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉంటోంది. కొద్దిరోజులుగా 1013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతేమొత్తంలో అవుట్‌ఫ్లో వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43.967 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 330 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ పథకానికి 231 క్యూసెక్కులు వెళుతుండగా, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు కలిపి మొత్తం 1013 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో వెళుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement