గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకానికి 20న డెమో క్లాస్‌ | - | Sakshi
Sakshi News home page

గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకానికి 20న డెమో క్లాస్‌

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకానికి 20న డెమో క్లాస్‌ గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్‌ జైలు అనుభవానికి ఆహ్వానం పరీక్షలకు సిద్ధం చేయండి ఓబీసీ మోర్చా నిర్మల్‌ ఇన్‌చార్జిగా మాదాసు స్వామి యాదవ్‌

సుభాష్‌నగర్‌: ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గె స్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఈనెల 20న నగరశివారులోని దాస్‌నగర్‌ ఎంజేపీ కళాశాలలో డె మో క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఆర్‌సీవో సత్యనాథ్‌రె డ్డి మంగళవారం తెలిపారు. డిగ్రీ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ 1, కామర్స్‌ 1, జువాలజీ 1 సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో 55 శాతం ఉత్తీర్ణతతో పాటు నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. డెమోకు సంబంధిత ధ్రువపత్రాలతో మహిళా అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని తెలిపారు.

మోపాల్‌: జిల్లాలోని బాలబాలికల గురుకుల పాఠశాల/కళాశాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 22న స్పాట్‌ అడ్మిషన్‌, కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీసీవో విజయలలిత మంగళవారం తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు, ఇంట ర్‌ ఫస్టియర్‌లో బాలికలు 160 సీట్లకు, బాలురు 231 సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తా మన్నారు. 22న కంజర్‌ గురుకుల పాఠశాలలో బాలికలకు, ఆర్మూర్‌ గురుకుల పాఠశాలలో బాలురకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వ రకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు సీ ట్ల కేటాయింపు ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌ లో ప్రవేశ పరీక్ష రాసి ఏ పాఠశాలలో కూడా సె లెక్ట్‌ కానీ వాళ్లకు మొదటి ప్రాధాన్యత, పరీక్షకు దరఖాస్తు చేసుకోలేక, పరీక్ష రాయలేక సీట్లు అవసరమున్న వారికి రెండో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఏ గురుకుల పాఠశాలలో కూడా సీటు లభించని అభ్యర్థులకు మాత్రమే ఈ కౌన్సిలింగ్‌లో సీట్లు కేటాయిస్తామని విజయలలిత తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో జైలు అనుభవం అనే కార్య క్రమం అందుబాటులో ఉందని జిల్లా జైలు సూపరింటెండెంట్‌ ఆశోక్‌ మంగళవారం తెలి పారు. ప్రజలకు వాస్తవిక అవగాహన కల్పించడంతోపాటు స్వేచ్ఛ విలువలను తెలియజేయ డం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఆసక్తి గల వారు జైలు అనుభవం కోసం ఫీల్‌ ఈవెంట్‌ పేజీ ద్వారా టికెట్‌ బుక్‌చేసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారు అర్హులని, 12 గంటల జైలు అనుభవానికి రూ. వెయ్యి, 24 గంటల అనుభవానికి రూ.2వేలు రుసుం విధించినట్లు తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: వచ్చే నెలలో నియోస్‌ ఓపెన్‌స్కూల్‌, ఉల్లాస్‌కు సంబంధించిన పరీక్షలు ఉన్నందున నిరక్షరాస్యులను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ భుజంగరావు అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని, హాజరుకాని వారిని రెండో దశలో గుర్తించి పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో అభ్యాసకుల గుర్తింపు నమోదు హాజరుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. డీఈవో అశోక్‌, వయోజన విద్యాఉపసంచాలకులు పురుషోత్తం తదితరులున్నారు.

సుభాష్‌నగర్‌: బీజేపీ ఓ బీసీ మోర్చా నిర్మల్‌ జి ల్లా ఇన్‌చార్జిగా నగరాని కి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదాసు స్వా మి యాదవ్‌ను రాష్ట్ర అఽ ద్యక్షుడు ఆనంద్‌ గౌడ్‌ మంగళవారం నియమించారు. ఈసందర్భంగా స్వామి యాదవ్‌ మాట్లాడుతూ.. తనకు రాష్ట్ర నాయకత్వం అందించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, నిర్మల్‌ జిల్లాలో బీసీ సమాజాన్ని ఏకం చేసి వా రి హక్కుల కోసం నిరంతర కార్యక్రమాలు ని ర్వహిస్తామని తెలిపారు. బీసీ బిడ్డ నరేంద్ర మో దీ నేతృత్వంలో భారత దేశం ప్రపంచాన్నే శా సించే శక్తిగా ఎదిగిందని, ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో తాము కూడా బీసీ కులాలను ఏకంచేసి సుసంపన్న భారతదేశాన్ని నిర్మిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. నిర్మల్‌ జిల్లా ఇన్‌చార్జిగా తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యకుడు ఆనంద్‌ గౌడ్‌, రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement