చిట్టి గుండె ఆగింది | - | Sakshi
Sakshi News home page

చిట్టి గుండె ఆగింది

Aug 16 2026 6:21 AM | Updated on Aug 16 2026 6:21 AM

సైబర్‌ మోసంలో రూ.3 వేలు రికవరీ చట్టం దృష్టిలో అందరూ సమానులే చెరువులో పడి వృద్ధురాలి మృతి

పంద్రాగస్టు రోజే ప్రాణాలొదిలిన విద్యార్థి

గతంలో గుండెకు ఆపరేషన్‌

కేశపూర్‌ గ్రామంలో విషాదఛాయలు

నిజామాబాద్‌ రూరల్‌ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్‌కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాత్వికకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్‌ నళిని తల్లికి సమాచారం అందించారు. దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాత్విక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది.

రుద్రూర్‌: కోటగిరికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల సైబర్‌ మోసానికి గురికాగా, పోలీసులు స్పందించి కొంత డబ్బును రికవరీ చేశారు. బాధితుడు రూ.7 వేలను కోల్పోగా, పోలీసులు, బ్యాంకు అధికారుల సమన్వయంతో మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిన నగదును ఫ్రీజ్‌ చేశారు. రూ.3 వేలను బాధితుడి బ్యాంకు ఖాతాలో జమ చేశామని, మిగతా మొత్తాన్ని రికవరీ చేసి నిందితులను పట్టుకుంటామని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి సుష్మ

ఎల్లారెడ్డిరూరల్‌: చట్టం దృష్టిలో అందరూ సమానులేనని ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి సుష్మ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో శనివారం న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టం అందరికీ సమన్యాయం కల్పిస్తుందని సూచించారు. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించారు. బాలల హక్కులను వివరించారు.

భిక్కనూరు : మండలంలోని జంగంపల్లి పెద్ద చెరువులో వృద్ధురాలు పడి మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అనిల్‌ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు పుల్లూరి సిద్దమ్మ (60) గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. పలు ఆస్పత్రుల తిరిగినా ఆరోగ్యం కుదుటపడలేదు. శుక్రవారం మెదక్‌ జిల్లా గంగాపురంలోని తన బంధువుల ఇంటి నుంచి జంగంపల్లి గ్రామానికి వెళ్తానని చెప్పి బయలుదేరిన సిద్దమ్మ శుక్రవారం రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబీకులు ఆమె కోసం పలు చోట్ల వెతికిన ఆచూకీ లభించలేదు. శనివారం స్థానిక పెద్ద చెరువులో మృతదేహం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని గ్రామానికి చెందిన పుల్లూరి సిద్దమ్మగా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అనిల్‌ పేర్కొన్నారు.

విద్యుత్‌షాక్‌తో గేదె..

ఎల్లారెడ్డి: విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి చెందినట్లు స్థానికులు శనివారం తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన మండ్రు ప్రకాష్‌ యొక్క గేదె మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద గల విద్యుత్‌ తీగలకు తగిలి మృతి చెందింది. గేదె విలువ రూ. 30 వేల ఉంటుందని బాధితుడు పేర్కొన్నారు.బాధితుడికి విద్యుత్‌ శాఖ అధికారులు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement