న్యూస్‌రీల్
నిజామాబాద్
● స్వాతంత్య్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలు ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
వాతావరణం
ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు స్వాతంత్య్ర వేడుకల్లో ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్ అర్బన్: అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా ముందంజలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర అంటే ప్రతి పౌరుడు కనీస సౌకర్యాలైన కూడు, గుడ్డ, గూడు లభించేలా తమ కాళ్లపైతాము స్వేచ్ఛాయుతంగా ఎదగడమన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు. సుదర్శన్‌రెడ్డి ప్రసంగం సాగిందిలా..
వ్యవసాయం
2026 వానాకాలం సీజన్‌కు గాను ఇప్పటి వరకు 3.87 లక్షల ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో సోయా, 900 ఎకరాల్లో కంది సాగవుతోంది. రైతులకు 42,983 మెట్రిక్ టన్నుల యూరియా, 11,554 డీఏపీ, పొటాష్ 1,913, కాంప్లెక్స్ ఎరువులు 38,067 మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం.
పౌర సరఫరాలు
జిల్లాలో 4,77,780 ఆహార భద్రత కార్డుల ద్వారా 16,09,447 మంది లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఏప్రిల్ నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ అవుతోంది.
ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించి, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశాం.
విద్యుత్
గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2,72,300 కుటుంబాలకు ప్రతి నెలా జీరో బిల్లులు జారీ చేసి రూ.296 కోట్ల 25 లక్షల సబ్సిడీని అందించాం.
గ్రామీణాభివృద్ధి సంస్థ
28 మండల సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం బస్సులను మంజూరు చేసింది. ఆర్టీసీ ఇప్పటి వరకు మండల సమాఖ్యలకు రూ.80 లక్షల 83 వేల అద్దె జమ చేసింది. జిల్లా సమాఖ్యకు ప్రతి నెలా రూ.69,468 జమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ ద్వారా 400 స్వయం సహాయక సంఘాలకు రూ.46 కోట్ల 49 లక్షల 85 వేల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది.
విద్య
జిల్లాలోని 1,159 పాఠశాలల్లో 97,720 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. స్కూళ్లలో అదనపు గదులు, మరుగుదొడ్లు, మంచి నీటి సదుపాయం కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద జిల్లాకు రూ.42 కోట్ల 23 లక్షల 58 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రూ.24 కోట్ల 27 లక్షల 93 వేలు విడుదల చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలోని నాలుగు చోట్ల కొత్త యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు పురోగతిలో ఉన్నాయి.
రహదారులు, భవనాలు
2024–25 సంవత్సరంలో రూ.63 కోట్ల రూపాయలతో 12 పనులు మంజూరు కాగా వాటిలో మూడు పనులు పూర్తయ్యాయి. మరో ఎనిమిది పనులు పురోగతిలో ఉన్నాయి. మిగతా ఒక పని టెండర్ దశలోగుంది. ఆయా పనుల కోసం ఇప్పటి వరకు రూ.26 కోట్ల 12 లక్షలు ఖర్చు చేశాం. 2025–26 సంవత్సరంలో రూ.96 కోట్ల 46 లక్షల రూపాయలతో 17 పనులు మంజూరు కాగా.. పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. 2026–27 సంవత్సరంలో మూడు పనులు రూ.4 కోట్ల 4 లక్షలతో మంజూరు కాగా.. అందులో 2 పనులు అగ్రిమెంట్ దశలో, ఒక పని టెండర్ దశలో ఉన్నాయి. హ్యామ్ రోడ్స్ పథకం కింద 17 పనులు 256.63 కిలో మీటర్లు రూ.389 కోట్ల 94 లక్షలతో మంజూరు చేయడం జరిగింది.
కంజర టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ విద్యార్థినుల నృత్యం..
వైద్యారోగ్యం
జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లాలో 2025–26 సంవత్సరానికి రూ.27 కోట్ల 28 లక్షల నిధులను వివిధ ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేయడం జరిగింది. బోధన్ మున్సిపాలిటిలో చావిడి వద్ద రూ.13 లక్షలతో మంజూరు చేసిన బస్తీ దవాఖానను జనవరిలో ప్రారంభించాం. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌లో ప్రస్తుతం 134 రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతోంది. 2026 జనవరి నుంచి 2,96,774 శాంపిళ్లను సేకరించి 5,98,708 పరీక్షలు చేయడం జరిగింది.


