● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో పాల్గొననున్న
రేవంత్‌రెడ్డి
● భారీభద్రతా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందకు ఆదివా రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదా లో రేవంత్‌రెడ్డి తొలిసారిగా జుక్కల్ నియోజకవర్గానికి వస్తుండడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశాలున్నా యి. సీఎం పెళ్లి వేడుకలో పాల్గొనడానికే వస్తున్నప్పటికీ నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపిస్తారన్న ఆశలో జనం ఉన్నారు.
ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే..
నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఈ నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగపడదు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో సింగి తం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోయింది. తాత్కాలిక మరమ్మతులతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి పనులు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నాగమడుగు ఎత్తిపోతల పథకం మొదట్లోనే ఆగిపో యింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల కు దూరాన ఉన్న జుక్కల్ ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పీజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రానికి వెళ్లా లంటే సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్ డిపో ఏర్పాటు చే స్తే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మె రుగుపడుతుంది. ఈ ప్రాంతంలో అపరాలు ఎ క్కువగా సాగవుతాయి. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవ డంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించలేకపోతున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


