క్యాంప్‌ కార్యాలయంలో జెండావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

క్యాంప్‌ కార్యాలయంలో జెండావిష్కరణ

Aug 16 2026 6:03 AM | Updated on Aug 16 2026 6:03 AM

నిజామాబాద్‌ అర్బన్‌: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ భవే శ్‌ మిశ్రా క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ వి.భుజంగరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, ట్రెయినీ ఆర్డీవో సందీప్‌, కలెక్టరేట్‌ ఏవో బాలరాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ టాపర్‌కు

అరుదైన గౌరవం

ఆ గ్రామంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేది వారే..

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామస్తులు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించినవారికి అరుదైన గౌరవాన్ని ఇస్తున్నారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా టాపర్‌తో జాతీయ పతాకాన్ని ఎగురవేయిస్తున్నారు. శనివారం నిర్వహించిన వేడుకల్లో పదో తరగతి గ్రామ టాపర్‌ అయిన హర్షిత జెండా ఎగురవేశారు. విద్యార్థులలో చదవా లన్న పట్టుదలను పెంచేందుకు మూడేళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని సర్పంచ్‌ చింతల కిషన్‌ తెలిపారు.

పాఠశాలకు ఏడాది గౌరవ వేతనం

బోధన్‌: ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్‌ కందగట్ల రాంచందర్‌ తన ఏడాది వేతనం మొత్తం రూ.78 వేలు విరాళంగా అందజేశారు. శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్‌ విరాళం చెక్కు ను హెచ్‌ఎం రవికుమార్‌కు అందించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కు లు సాధించిన పాఠశాల విద్యార్థిని శ్రీనిధికి ప్రోత్సాహకంగా రూ.11,111 నగదును అందజేశారు.

పదో తరగతిలో

ఉత్తీర్ణులైన ఖైదీలు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా జైలులోని 15 మంది ఖైదీలు పదో తరగతిలో ఉత్తీర్ణ సాధించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఖైదీల కోసం ప్రత్యేకంగా విద్యాభ్యాసం కొనసాగుతుండగా.. 16 మంది ఖైదీలు పరీక్షలు రాశారు. గతేడాది మేలో జిల్లా జైలులో ఎన్‌ఐవోఎస్‌ ద్వారా తరగతులను ప్రారంభించారు. జైలులోనే ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు సూపరింటెండెంట్‌ అశోక్‌ శనివారం ప్రకటనలో తెలిపారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలోని డీ–1 సెక్షన్‌ పవర్‌హౌజ్‌ కంపౌండ్‌ సబ్‌స్టేషన్‌లో పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్‌–1 ఏడీఈ ఆర్‌ చంద్రశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పవర్‌హౌజ్‌ కంపౌండ్‌ సబ్‌స్టేషన్‌లో కొత్త 33 కేవీ బ్రేకర్‌ బిగించనున్న కారణంగా.. మాలపల్లి, శాంతినగర్‌, బాబన్‌సాహెబ్‌పహాడ్‌, ఖిల్లా రోడ్‌, గాజుల్‌పేట్‌, లైన్‌గల్లీ, హతాయిగల్లీ తదితర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఏడీఈ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement