ఒక్క బియ్యం గింజ పక్కదారి పట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

ఒక్క బియ్యం గింజ పక్కదారి పట్టొద్దు

Aug 16 2026 6:03 AM | Updated on Aug 16 2026 6:03 AM

సుభాష్‌నగర్‌: పేద కుటుంబాలు కూడా మూడు పూటల అన్నం తినాలనే ఆశయంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొ ద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. పేదల కోసం పంపిణీ చేస్తున్న ఒక్క బియ్యపు గింజ కూడా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. డిజిటల్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నగరశివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. సుదర్శన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం అందించిన దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగపడక 70 శాతం అమ్ముకునే వారని, పీడీఎస్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదలకు ఆహార భద్రత భరోసా ఏర్పడిందన్నారు. డిజిటల్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా రేషన్‌ పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీత నం తీసుకువచ్చిందని తెలిపారు. కలెక్టర్‌ భవేశ్‌ మి శ్రా, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్‌, రాకేశ్‌ రెడ్డి, మేయర్‌ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడు గు గంగాధర్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, ఏఎంసీ చైర్మ న్‌ ముప్ప గంగారెడ్డి, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్‌ సప్లైస్‌ డీఎం ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్‌ రేషన్‌ కార్డులతో మరింత

పారదర్శకత, జవాబుదారీతనం

ప్రభుత్వ సలహాదారు

పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి

పండుగ వాతావరణంలో

స్మార్ట్‌ కార్డుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement