ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Aug 16 2026 6:03 AM | Updated on Aug 16 2026 6:03 AM

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఘనంగా సాగాయి. జిల్లా యంత్రాంగం విస్తృత ఏ ర్పాట్లు చేయగా.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభు త్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పుర ప్రముఖులను, అధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసా య, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, డెయిరీ, పశు సంవర్ధక, అటవీ, విద్య, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్‌ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్‌ తదితర శాఖల ఫొటో ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను సందర్శించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్‌, పౌరసరఫరాలు, హౌ సింగ్‌ తదితర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, పోలీసులకు మెడల్స్‌ను సుదర్శన్‌రెడ్డి అందజేశారు. స్వాతంత్య్ర సమర యోధులతోపాటు వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.

ఆయా పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు కొనసాగాయి. కంజర రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల, విశ్వ వికాస్‌ హైస్కూల్‌, నవీపేట్‌ బాలికల జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులు, టైం స్కూల్‌ చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్‌ భూపతిరె డ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, నగర మేయర్‌ ఉమారాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ తారీఖ్‌ అన్సారీ, పోలీస్‌ కమిషనర్‌ పి సాయిచైతన్య, అదనపు కలెక్టర్‌ భుజంగరావు, డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, అదనపు డీసీపీ శుభం నగ్రా లే, డీఆర్‌వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్‌ ది లీప్‌కుమార్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకు మా ర్‌, ట్రెయినీ ఆర్డీవో సందీప్‌, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయో ధులు, ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని

ఆవిష్కరించిన సుదర్శన్‌రెడ్డి

ఆకట్టుకున్న శకటాలు..

సాంస్కృతిక ప్రదర్శనలు

ఉత్తమ సేవలందించిన

ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

పోలీసులకు మెడల్స్‌

స్వాతంత్య్ర సమరయోధులకు

ఘన సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement