● డీఆర్‌డీవో సాయన్న
సుభాష్‌నగర్: సీ్త్రనిధి రికవరీ డబ్బులు ఎవరైనా ఆర్‌పీలు సొంతానికి వాడుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీఆర్‌డీవో సాయన్న ఆదేశించారు. గురువారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో మెప్మా సిబ్బంది, ఆర్‌పీలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి లింకేజీ, రికవరీ, కొత్త సంఘాల ఏర్పాటు, తదితర అంశాలపై సమీక్షించారు. అలాగే మన సీ్త్రనిధి యాప్, డైరెక్ట్ ఎస్‌హెచ్‌జీల ద్వారా సీ్త్రనిధికి రికవరీ చేయడం, ఎస్‌ఎల్‌ఎఫ్ వారీగా ఆర్‌పీల లక్ష్యం, ప్రగతిని డీఆర్‌డీవో అడిగి తెలుసుకున్నారు. లక్ష్య చేధనలో వెనకబడిన సిబ్బంది వారం రోజుల్లో రికవరీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. విధులపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని, సీ్త్రనిధి యాప్‌ను ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మెప్మా ఏవో విజయలక్ష్మి, డీఎంసీ మాధురి, సీ్త్రనిధి ఆర్‌ఎం రాందాస్, మేనేజర్లు మురళీకృష్ణ, చిరంజీవి, సుగుణ, టీఎంసీలు, సీవోలు, ఆర్‌పీలు పాల్గొన్నారు.


