న్యూస్‌రీల్
● నిజామాబాద్ అర్బన్‌లో అత్యధిక సంఖ్యలో ఓట్ల తొలగింపు!
ఐదేళ్లలోపు పిల్లల..
ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించేందుకు వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు.
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను పట్టణ ప్రాంత ఓటర్లు లైట్‌గా తీసుకున్నారా?
అంటే.. అవుననే నిరూపిస్తున్నాయి గణాంకాలు. నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో ఏకంగా 49,317 మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్‌లను నింపి బీఎల్‌వోలకు అందజేయకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికంగా 42,015 మంది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో శక్తిమంతమైన ఆయుధంగా పేర్కొనే ఓటును పట్టణ ఓటర్లు పట్టించుకోలేదు!
స్వచ్ఛమైన పసుపు
కొనుగోలుకు కృషి
జక్రాన్‌పల్లి: స్పైసెస్ బోర్డు ద్వారా వచ్చే సీజన్‌లో స్వచ్ఛమైన పసుపు కొనుగోలు జరిగేలా కృషి చేస్తామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూశ్ అన్నారు. స్పైసెస్ బోర్డ్, రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని ఐదు గ్రామాల పసుపు రైతులతో మండలంలోని మనోహరాబాద్ లో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యూశ్ మాట్లాడుతూ.. ఎటువంటి పురుగు మందులు వాడకుండా పసుపు సాగు చేయాలని, క్లోరోపైరిఫాస్ ఫార్ములా ఉన్న మందును ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని సూచించారు. రసాయన ఎరువులు వాడితే పసుపు ఎగుమతి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. భవిష్యత్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెట్ లింకేజ్ ప్రోగ్రాంను కొనసాగించడానికి ఎగుమతిదారు వెంకటకృష్ణతో చర్చించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి, మనోహరాబాద్ సర్పంచ్ అల్లూరి లక్ష్మీలింబారెడ్డి, స్పైసెస్ బోర్డ్ అధికారులు రాజమాణిక్యం, రాణి, స్థానిక ఏఈవో వంశీకృష్ణ, డైరెక్టర్లు రాజు, అల్లూరి సంతోష్, పుప్పాల నాగేశ్, సామ గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
11 రోజుల్లో
40 ఎకై ్సజ్ కేసులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 11వ తేదీ వరకు 40 కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అరుణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, మోర్తాడ్, స్టేషన్‌ల పరిధిలో దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దాడుల్లో 10 లీటర్ల గుడుంబా, 25 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడంతోపాటు 20 కల్లు శాంపిళ్లు తీసుకున్నామని తెలిపారు. ఆయా కేసుల్లో 20 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో
వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గింది. మంగళవారం వేకువజామున 12,604 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి 3,430 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 43.091 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జాతీయస్థాయి
లగోరిలో ప్రతిభ
వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ హై స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి లగోరి ఆటలో ప్రతిభ కనబర్చినట్లు హెచ్‌ఎం మల్లీశ్వరి, పీడీ దేవసుకన్య తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని అభినందించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు విశాఖపట్టణంలో కొనసాగిన జాతీయస్థాయి లగోరి ఆటలో బాలురు ప్రథమస్థానంలో, బాలికలు ద్వితీయస్థానంలో నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిచందర్, రఘునాథ్, శ్రీదేవి, రాజేంద్ర, సదాశివ్, దేవరాజ్, వినోద్, శ్రీలక్ష్మి, యమున, జాన్సన్, వేణుగోపాల్‌రెడ్డి, రాజు, సీఆర్పీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పట్టణాల్లో
పట్టింపేది సర్
నిజామాబాద్ అర్బన్: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పట్టణ ప్రాంత ఓటర్ల నిర్లక్ష్యం వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటు వేయడంలో వెనుకబడే పట్టణ ప్రాంతాల వారు తమ విలువైన ఓటు హక్కును కాపా డుకోవడంలోనూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి అందజేసిన ఎన్యుమరేషన్‌ఫామ్‌లను నింపి తిరిగి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. దీంతో జి ల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో ఓటు తొ లగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,11,864 ఓట్లు తొలగింపు జాబితాలో ఉండగా.. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో మృతి చెందిన, వసల వెళ్లిన వారితోపాటు డబుల్ ఓట్లు మొత్తం 1,25,710 ఉన్నాయి. పట్టణాల్లో 49,317 మంది ఓటర్లు సర్ ప్రక్రియలో పాల్గొనలేదు. ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందచకపోవడం, బీఎల్‌వోలు ఇంటికి వెళ్లినా అందుబాటులో లేకపోవడంతో 49వేల మందికిపైగా ఓటర్లను అధికారులు ఆబ్సెంట్ కాలమ్‌లో చేర్చారు.
● ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 94,488 మంది ఓటర్లు ఉండగా, 79,478 ఎన్యుమరేషన్ ఫామ్‌ల (84.11 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇక్కడ ఒక్క దరఖాస్తును మాత్రమే బీఎల్‌వోలు పరిశీలించలేదు. మరణించిన వారి ఓట్లు 3288, వలస వెళ్లిన వారి ఓట్లు 5,257 ఉండగా, డబుల్ ఓట్లు 4,926 ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ 1,483 మంది ఓటర్లు బీఎల్‌వోలకు అందుబాటులోకి రాలేదు. 56 మంది ఓట్లను ఇతరుల కాలమ్‌లో చేర్చారు. ఆర్మూర్ పట్టణంలో మొత్తం 15,010 ఓట్లు తొలగిపోనున్నాయి.
● బోధన్ మున్సిపాలిటీలో 98,440 ఓట్లు ఉండగా, 83,782 ఎన్యుమరేషన్ ఫామ్‌ల (85.11 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. మరణించిన వారి ఓట్లు 2,329, వలస వెళ్లిన వారి ఓట్లు 6,800 ఉండగా, 1,521 డబుల్ ఓట్లను గుర్తించారు. బోధన్ పట్టణంలో 4004 మంది ఓటర్లు బీఎల్‌వోలకు అందుబాటులోకి రాలేదు. ఇతరుల ఓట్లు నాలుగు ఉండగా, మొత్తం 14,658 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది.
● బాన్సువాడ పట్టణంలో 398 మంది సర్‌కు దూరంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 52,470 మంది ఓటర్లు ఉండగా 46,590 ఎన్యుమరేషన్‌ఫామ్‌ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. 5,880 ఓట్లు తొలగిపోనున్నాయి.
● భీమ్‌గల్ మున్సిపాలిటీలో 53,771 ఓటర్లు ఉండగా.. 47,038 ఎన్యుమరేషన్ ఫామ్‌ల(87.48 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. మరణించిన వారి ఓట్లు 1,248, వలస వెళ్లిన వారి ఓట్లు 2,014 ఉండగా, 2,046 ఓట్లను డబుల్ ఓట్లుగా గుర్తించారు. 1,417 మంది ఓటర్లు సర్‌కు దూరంగా ఉన్నారు. ఇక్కడ ఇతరులు 8 మంది ఉండగా, 6733 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది.
ప్రజాభద్రతకు
సీసీ కెమెరాలు అవసరం
జక్రాన్‌పల్లి: సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ‘మన ఊరు, మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను సీపీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. పోలీస్ శాఖ చేపడుతున్న క మ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. ఏసీపీ ప్రకాశ్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, డిచ్‌పల్లి సీఐ తిరుపతి, స్థానిక ఎస్సై మహేశ్, సర్పంచ్ బండి పద్మ సత్యం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం సంజయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని నార్త్ మండలంలో 1,51,385 మంది ఓటర్లు ఉండగా, 1,10,884 ఎన్యుమరేషన్ ఫామ్‌ల (73.25 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యింది. 29 దరఖాస్తులను బీఎల్‌వోలు పరిశీలించలేదు. చనిపోయిన ఓటర్లు 2,584 మందిని, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారిని 5,966 మందిని, 6,022 మంది డబుల్ ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే 21,723 మంది ఓటర్లు బీఎల్‌వోలకు అందుబాటులోకి రాలేదు. 4,206 మంది ఓటర్లను ఇతరుల కాలమ్‌లో చేర్చారు. ఇక్కడ మొత్తం 40,501 ఓట్లు తొలగిపోనున్నాయి. నిజామాబాద్ సౌత్ మండలంలో 1,56,876 ఓటర్లు ఉండగా 1,13,948 ఫామ్‌ల డిజిటలైజేషన్(72.64 శాతం) పూర్తయ్యింది. 107 ఫామ్‌లను బీఎల్‌వోలు పరిశీలించలేదు. 2,800 మంది ఓటర్లు మృతి చెందినట్లుగా, 9141 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిగా, 6145 మంది డబుల్ ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ మండలంలో 20,292 మంది బీఎల్‌వోలకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. 4,550 ఓటర్లను ఇతరుల కామల్‌లో చేరారు. సౌత్ మండలంలో 42,928 మంది ఓట్లు తొలగిపోనున్నాయి. ఈ లెక్కన అర్బన్ నియోజకవర్గంలో మొత్తం 83,429 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది.
మున్సిపాలిటీల్లో
ఎన్యుమరేషన్ ఫామ్‌లు
అందజేయని 49వేల మంది


