నిజామాబాద్ అర్బన్: జీతాల కోసమే పని చేయొద్దని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టునూ వృథా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగి అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా హితవు పలికారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల సిరి’ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చే శారు. జలసిరి, హౌసింగ్, వన మహోత్సవం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిప ల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేప ట్టని మండలాల ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. వా రం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. అలసత్వం వహిస్తే స రెండర్ చేస్తానని హెచ్చరించారు. వన మహోత్స వంలో భాగంగా ఆయా శాఖలు నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి సరక్షించాలని, ఇప్పటికే నాటిన మొక్కలను ఈ నెల 29వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మొక్క లు నాటకుండా తప్పుడు నివేదికలు సమర్పించిన వారి నుంచి నిధులు రికవరీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని సెప్టెంబర్ 15లోగా సాధించాలని గడువు విధించారు. అదనపు కలెక్టర్ వి భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్‌వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు..
జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) రూపకల్పన కోసం కచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, ఆయా రంగాల ప్రముఖులతో జనగణన–2027కు సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్‌బుక్ కు అందించాల్సిన సమాచారంపై చర్చించి సూచనలు చేశారు.
‘జలసిరి’ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ఈ నెల 29న వనమహోత్సవం మొక్కలను పరిశీలించండి
సమీక్షా సమావేశంలో అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా


