ఖలీల్‌వాడి : సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లి జూనియర్ కళాశాల అధ్యాపకులకు రెండవ స్పెల్ రెండు రోజుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులను డీఐఈవో మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట చూపే విధంగా అధ్యాపకులు బోధన చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న అన్ని వర్గాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేపట్టాలని సూచించారు. ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య తదితరులు ఉన్నారు.


