తాడ్వాయి : గ్రామాల్లో సైబర్ మోసాలపై అప్రమ త్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే మోస పూరిమైన ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదలయిందని, ఈ నోటిఫికేషన్‌ను యువకులు వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నా రు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డ యల్ చేయాలన్నారు. ఎస్‌ఐ నరేశ్, గ్రామపోలీసు యాదగిరి, సర్పంచ్ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.


